నాగార్జున అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పారిపోయిన సమంత..!

సౌత్ లో టాప్ మోస్ట్ హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో సమంత ( Samantha )నెంబర్ 1 స్థానం లో ఉంటుంది.

ఈమెకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు మార్కెట్ కొంతమంది యంగ్ హీరోస్ కి కూడా లేదు.

హీరోయిన్ గా తెలుగు మరియు తమిళం భాషల్లో దాదాపుగా అందరితో నటించేసింది.అంతే కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో కూడా సూపర్ హిట్స్ ని అందుకొని తన సత్తా చాటింది.

ఈమె కెరీర్ ప్రారంభం అయ్యింది అక్కినేని నాగ చైతన్య( Akkineni Naga Chaitanya ) ఏం మాయ చేసావే సినిమాతో.ఈ చిత్రం అటు కమర్షియల్ గా సక్సెస్ సాధించడమే కాకుండా ఇటు కంటెంట్ పరంగా కూడా క్లాసికల్ లవ్ స్టోరీస్ లో ఒకటిగా నిల్చింది.

ఈ సినిమా అప్పటి నుండే సమంత మరియు నాగ చైతన్య మధ్య స్నేహం ఏర్పడింది, ఆ తర్వాత ఆ స్నేహం కాస్త ప్రేమగా మారి తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.

Advertisement

కొంతకాలం వరకు అన్యోయ దాంపత్య జీవితం కొనసాగించిన ఈ జంట కొన్ని అనుకోని కారణాల వల్ల విబేధాల తో విడిపోయిన ఘటన అభిమానులను శోకసంద్రం లోకి నెట్టేసింది.అయితే సమంత విడాకులు తీసుకోవడానికి ఏర్పడిన సందర్భాల గురించి అక్కినేని నాగార్జున పెళ్ళికి ముందే సమంత తో చర్చించాడట.మా ఇంట్లో కొన్ని రూల్స్ ఉంటాయి , అమల అనేక విషయాల్లో చాలా కచ్చితంగా ఉంటుంది, నువ్వు ఇండిపెండెంట్ గా బ్రతికే మనస్తత్వం మరియు ఆత్మాభిమానం ఉన్న అమ్మాయివి, నువ్వు ఆ పరిస్థితులను ఎదురుకోగలవా అని నాగార్జున సమంత ని అడిగాడట.

అప్పుడు సమంత నాలుగు సంవత్సరాల నుండి నేను చైతన్య తో డేటింగ్ చేస్తున్నాను, మా ఇద్దరి మధ్య ఎలాంటి ఇబ్బందులు లేకపోవడం వల్లే పెళ్లి చేసుకోవడానికి సిద్ద పడ్డాము, రేపు భవిష్యత్తులో ఎలాంటి సమస్య వచ్చినా ఎదురుకుంటాము అంటూ నాగార్జున ( Nagarjuna )కి చెప్పిందట.మరి ఇంటి పద్ధతులకు తగ్గట్టుగా ఉంటాను అని మాట ఇస్తావా అని నాగార్జున అడిగాడట.

మాట ఇస్తావా అని అడిగినప్పుడు సమంత నుండి ఎలాంటి రియాక్షన్ రాలేదట, కేవలం ఎలాంటి సమస్య రాకుండా చూసుకుంటాను అని మాత్రమే చెప్పిందట.ఇక ఈ విషయం గురించి ఇప్పుడే చర్చలు ఎందుకు అని సమాధానం దాటవేసింది అట.అప్పుడు నాగార్జున చెప్పిన సందర్భాలే ఇప్పుడు సమంత ( Samantha )విడాకులు తీసుకోవడానికి కారణం అయ్యాయి.ఇంట్లో పరిస్థితులకు తగ్గట్టుగా నడుచుకోకపోవడం తో విబేధాలు వచ్చి సమంత విడిపోయిందని ఇండస్ట్రీ వర్గాల్లో ఎప్పటి నుండి వినిపిస్తున్న టాక్.

బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!
Advertisement

తాజా వార్తలు