టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న నటి సమంత.స్టార్ హీరోయిన్ గా తెలుగు, తమిళ్ బాషలలో ఇప్పటికి ఆమెకి మంచి గుర్తింపు ఉంది.
ఆమె చేయాలంటే స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్ గా అవకాశాలు వస్తాయి.అయితే ఈ అమ్మడు కెరియర్ పదేళ్లు పూర్తి చేసుకున్న తర్వాత సినిమాల ఎంపిక విషయంలో పూర్తిగా రూటే మార్చేసింది.
ఎక్కువగా లేడీ ఒరియాంటేడ్ కథలకి మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.ఓ బేబీ సినిమాతో సోలోగా సూపర్ సక్సెస్ కొట్టిన సమంత ఆ తరువాత ది ఫామిలీ మెన్ వెబ్ సిరీస్ మాత్రమే చేసింది.
ఈ వెబ్ సిరీస్ త్వరలో టెలికాస్ట్ కాబోతుంది.ఇదిలా ఉంటే లాక్ డౌన్ కి ముందు కోలీవుడ్ లో విగ్నేష్ శివన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి కి జోడీగా నటించడానికి ఒకే చెప్పింది.
ఈ సినిమాలో నయనతార మరో హీరోయిన్ గా నటిస్తుంది.
అయితే ఈ సినిమాని త్వరలో సెట్స్ పైకి తీసుకొని వెళ్లాలని అనుకుంటున్నారు.
ఇలాంటి సమయంలో ఊహించని విధంగా సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తుంది.సినిమాలో ఆమె పాత్రకి సరైన ప్రాధాన్యత లేకపోవడంతో చేయలేనని తప్పుకుందని సమాచారం.
ఇలా త్వరలో షూటింగ్ స్టార్ట్ చేద్దామని అనుకున్న టైంలో సమంత ఇలా హ్యాండ్ ఇవ్వడంతో ఇప్పుడు మరో హీరోయిన్ వేటలో చిత్ర బృందం పడింది.కీర్తి సురేష్, త్రిషని సెకండ్ లీడ్ కోసం సంప్రదిస్తున్నట్లు సమాచారం.
అయితే నయనతారకి మంచి ప్రాధాన్యత ఇచ్చి తన పాత్ర ప్రాధాన్యతని తగ్గించడం వలెనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోగట్టా.