అక్కినేని ఇంటి కోడలుగా సమంత అడుగు పెట్టి సంవత్సరం కాబోతుంది.ఇన్నాళ్లు నాగచైతన్య, సమంతల ప్రేమ గురించి ఎవరికి తోచిన విధంగా వారు చెప్పుకుంటూ వచ్చారు.
మొదటి సారి నాగచైతన్య మరియు సమంతలు వారి ప్రేమ కథలను చెప్పుకొచ్చారు.వారి ప్రేమ ఇప్పటిది కాదని, ఏడు సంవత్సరాలుగా ప్రేమ కొనసాగుతూ వస్తుందని చెప్పుకొచ్చారు.
ఇద్దరు కూడా తమదో గొప్ప ప్రేమ అన్నట్లుగా చెప్పడం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.తాజాగా సుశాంత్ హీరోగా తెరకెక్కిన ‘చిలసౌ’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది.
ఆ సినిమా ప్రమోషన్ బాధ్యత అంతా కూడా చైతూ మరియు సమంతలు చూస్తున్నారు.

‘చి.ల.సౌ’ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా వీరిద్దరు తమ ప్రేమ కథను చెప్పడం జరిగింది.నాగచైతన్య మాట్లాడుతూ.సమంత నాకు పది సంవత్సరాల క్రితం తెలుసు, ఆమెను ఏడు సంవత్సరాల క్రితం ట్రై చేశాను, పెళ్లికి ముందు ఆమెకు రెండు సంవత్సరాల క్రితమే తన ప్రేమను చెప్పాను.
అప్పటి వరకు ఆమెకు తన ప్రేమను చెప్పేందుకు చాలా ప్రయత్నించాను.కాని ఆమె మాత్రం తన లవ్‌ను పట్టించుకోలేదు.తాను పెళ్లికి ముందు చాలా మంది అమ్మాయిలతో తిరిగాను అని అంతా అనుకుంటారు.కాని తాను సమంత ప్రేమలో తప్ప మరెవ్వరి ప్రేమలో పడలేదు.
అసలు తనకు మరో అమ్మాయితో ప్రేమ విషయం చెప్పేంత ధైర్యం లేదు అంటూ చెప్పుకొచ్చాడు.ప్రేమించిన సమంతను పెళ్లి చేసుకోవాలనుకున్నాను, ఆమెనే పెళ్లి చేసుకున్నాను అంటూ చైతూ చెప్పుకొచ్చాడు.
ఇదే సమయంలో సమంత మాట్లాడుతూ.చైతూ పరిచయం అయిన వెంటనే ఆయన ప్రేమలో పడ్డాను.అయితే ఆయనకు తన ప్రేమను కనిపించకుండా ఉండేలా జాగ్రత్త పడ్డాను.ఒక అమ్మాయిగా తన ప్రేమను మొదట వ్యక్తం చేసేందుకు తెలియని ఫీలింగ్ అడ్డు వచ్చిందని, అయినా కూడా చైతూ నాతో ప్రేమ విషయం చెప్పినప్పుడు కాస్త టెన్షన్ పడ్డాను, మొత్తానికి చైతూ తన జీవిత భాగస్వామి అని నిర్ణయించుకుని పెళ్లికి సిద్దం అయ్యాను.
పెళ్లికి ముందు సంవత్సరంనర మాత్రమే ఇద్దరం ప్రేమించుకున్నాం.కొందరు చాలా సంవత్సరాల పాటు మేమిద్దరం ప్రేమించుకున్నాం అని అనుకుంటున్నారు.
కాని మేం మాత్రం ఎక్కువ కాలం ప్రేమలో ఉండకుండా, ప్రేమను వెంటనే పెళ్లి వద్దకు తీసుకు వెళ్లాం అంటూ చెప్పుకొచ్చింది.వీరి ప్రేమ కథ సినిమా కథను పోలి ఉందని, వీరు నిజం చెప్పినట్లుగా అనిపించడం లేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

మూడు సినిమాల్లో కలిసి నటించిన ఈ జంట త్వరలో నాల్గవ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నారు.శివ నిర్వాన దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కబోతుంది.ఇటీవలే లాంచనంగా ప్రారంభం అయిన ఈ చిత్రంలో చైతూ మరియు సమంతలు భార్య భర్తలుగా కనిపించబోతున్నారు.







