టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘బాహుబలి’ రెండు పార్ట్‌లు ఏ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ముఖ్యంగా బాహుబలి 2 చిత్రం బాలీవుడ్ సినిమాలకు సైతం అందని కలెక్షన్స్‌ను వసూళు చేసింది.
ఏకంగా రెండు వేల కోట్ల వసూళ్లను సాధించిన బాహుబలి 2 చిత్రంతో జక్కన్నకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది.హిందీలో ఈయన దర్శకత్వంలో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు క్యూలు కడుతున్నారు.
ఇంతటి క్రేజ్ ఉన్న రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ హీరోలుగా ఒక చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఒక వైపు ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల మల్టీస్టారర్ చిత్రాన్ని చేసేందుకు సిద్దం అవుతున్న జక్కన్న మరో వైపు ‘బాహుబలి 3’ చిత్రానికి కూడా స్క్రిప్ట్‌ను సిద్దం చేయిస్తున్నాడట.బాహుబలి మొదటి రెండు పార్ట్‌లకు స్క్రిప్ట్‌ను అందించిన విజయేంద్ర ప్రసాద్ ప్రస్తుతం మూడవ పార్ట్‌కు కూడా స్క్రిప్ట్‌ను రెడీ చేసే పనిలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది.మూడవ పార్ట్‌కు సబంధించిన విషయాన్ని విజయేంద్ర ప్రసాద్ బాలీవుడ్ మీడియా ముందు వెళ్లడి చేసినట్లుగా తెలుస్తోంది.
ఒక ప్రముఖ బాలీవుడ్ మీడియా సంస్థ ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది.
విజయేంద్ర ప్రసాద్ తన వద్ద ఉన్న 10 కథలతో కొత్త దర్శకులను పరిచయం చేస్తూ సినిమాలను చేసేందుకు ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాడు.
ఇదే సమయంలో విజయేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో పలు వెబ్ సిరీస్‌లు కూడా ప్రారంభం కాబోతున్నాయని సదరు బాలీవుడ్ మీడియాలో వార్త వచ్చింది.ఇదే సమయంలో బాహుబలి 3 గురించి కూడా సదరు మీడియాలో కథనం వచ్చింది.
బాలీవుడ్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం బాహుబలి చిత్రం కొనసాగింపుగా కాకుండా కొత్త కథతో ‘బాహుబలి 3’ ఉంటుందనిపిస్తుంది.

బాహుబలి 3 కథకు దర్శకత్వం ఎవరు వహిస్తారు అనేది కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా ఉంది.మొదటి రెండు పార్ట్‌లను రాజమౌళి తెరకెక్కించాడు.అయితే మూడవ పార్ట్‌కు జక్కన్న దర్శకత్వం వహించే అవకాశం కనిపించడం లేదు.
మరో వైపు తెలుగులో కాకుండా ఈ చిత్రాన్ని హిందీలో చేసేందుకు విజయేంద్ర ప్రసాద్ ప్లాన్ చేస్తున్నాడు.యూరోస్‌తో ఒప్పందం చేసుకున్న పది సినిమాల్లో బాహుబలి 3 ఒకటి అంటూ సమాచారం అందుతుంది.
ఈ విషయమై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.బాహుబలి 3 జక్కన్న కాకుండా మరెవ్వరు తీసినా కూడా ప్రేక్షకులు ఆధరించడం కష్టమే అంటూ సినీ వర్గాల వారు చెబుతున్నారు.







