నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా చేస్తున్న చిత్రం ‘ఎన్టీఆర్’.తన తండ్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రను బాలయ్య పోషిస్తున్న విషయం తెల్సిందే.
ప్రస్తుతం సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.ఇటీవలే మొదటి షెడ్యూల్‌ను రామోజీ ఫిల్మ్ సిటీలో పూర్తి చేయడం జరిగింది.
త్వరలో రెండవ షెడ్యూల్‌కు సంబంధించిన ఏర్పాట్లు మొదలు కాబోతున్నాయి.భారీ ఎత్తున ఈ చిత్రంను ప్రతిష్టాత్మకంగా బాలకృష్ణ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెల్సిందే.
బాలయ్య కెరీర్ ఆరంభం నుండి వరుసగా చిత్రాలు చేస్తూ వస్తున్నాడు.ఈమద్య కూడా ఒకేసారి రెండు మూడు సినిమాలు చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి.
అలాగే ఎన్టీఆర్ చిత్రంను చేస్తూనే తన తదుపరి చిత్రాన్ని చేసేందుకు సిద్దం అవుతున్నాడు.

మామూలుగా అయితే స్టార్ హీరోలు తాము ఏదైనా పెద్ద సినిమా చేసేప్పుడు తర్వాత సినిమా గురించి ఆలోచించరు.ప్రస్తుతం పెద్దా చిన్నా అనే తేడా లేకుండా ఎక్కువ మంది హీరోలు ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.కాని ‘ఎన్టీఆర్’ చిత్రం పూర్తి కాకుండానే బాలయ్య తన తదుపరి చిత్రాన్ని మొదలు పెట్టాలని ఆశ పడుతున్నాడు.
మొన్నటి వరకు వినాయక్ దర్శకత్వంలో బాలయ్య ఒక చిత్రాన్ని చేసేందుకు ఒకే చెప్పాడు.అయితే కథ విషయంలో కాస్త తేడా కొట్టడంతో ఆ కథను మార్చమంటూ వినాయక్‌కు సూచించాడు.
ఈ సమయంలోనే బోయపాటి దర్శకత్వంలో కూడా బాలయ్య ఒక చిత్రాన్ని చేసేందుకు సిద్దం అవుతున్నట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుతం రామ్ చరణ్‌తో ఒక చిత్రాన్ని చేస్తున్న బోయపాటి శ్రీనివాస్ తన తదుపరి చిత్రాన్ని బాలయ్యతో చేయబోతున్నట్లుగా ప్రకటించాడు.
బాలయ్య ఇలా ‘ఎన్టీఆర్’ మూవీ పూర్తి అవ్వకుండానే అప్పుడే మరో సినిమాను మొదలు పెట్టడం వల్ల ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉందని అనిపిస్తుంది.ఎన్టీఆర్ చిత్రంపై ఎక్కువ ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందని, ఎప్పుడు కూడా ఇలాంటి ప్రతిష్టాత్మక చిత్రం చేసే సమయంలో మరో సినిమా గురించి ఆలోచన చేయక పోవడం మంచిదని ఫ్యాన్స్ కూడా బాలయ్యకు సలహా ఇస్తున్నారు.

బాలకృష్ణ 100వ చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సమయంలో మరే సినిమాకు కమిట్ కాలేదు.అందుకే మొత్తం ఫోకస్ అంతా ఆ చిత్రంపైనే పెట్టాడు.అందుకే ఆ చిత్రం మంచి విజయాన్ని దక్కించుకుందని, ఇప్పుడు కూడా ఎన్టీఆర్ చిత్రంపైనే బాలయ్య ఫోకస్ చేయాలని అంతా కోరుకుంటున్నారు.మరి బాలకృష్ణ మాత్రం ఎన్టీఆర్ చిత్రం ఆన్ సెట్స్ ఉన్న సమయంలోనే మరో సినిమాను చేసేందుకు సిద్దం అవుతున్నాడు.
ఇది ఏ మేరకు ఎన్టీఆర్‌పై ప్రభావం చూపుతుందో చూడాలి.







