చాలా సంవత్సరాలుగా నందమూరి బాలకృష్ణ మరియు అక్కినేని నాగార్జున మద్య వివాదం ఏర్పడిన విషయం తెల్సిందే.వీరిద్దరి మద్య అప్పట్లో సన్నిహిత్యం ఉండేది.
కాని మద్యలో ఏం జరిగిందో తెలియదు కాని ఇద్దరు గత కొన్ని సంవత్సరాలుగా ఒకరి మొహం ఒకరు చూసుకునే పరిస్థితి లేదు.నాగార్జున మరియు బాలకృష్ణలు ఈ మద్య కాంలో ఒకే వేదికపై అసలు కనిపించలేదు.
వీరిద్దరి మద్య ఉన్న గొడవ ఏంటీ అనేది చాలా మందికి తెలియదు.సినీ ఇండస్ట్రీ వారికి కూడా ఎక్కువ శాతం వీరి మద్య గొడవ ఏంటీ అనే విషయం క్లారిటీ లేదు.
ఎన్టీఆర్, ఏయన్నార్‌ల మద్య మంచి సన్నిహిత సంబంధాలు ఉండేవి.కాని వారి వారసులు అయిన బాలకృష్ణ, నాగార్జునలు మాత్రం నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

ప్రస్తుతం బాకృష్ణ తన తండ్రి జీవిత చరిత్రతో ప్రతిష్టాత్మకంగా ‘ఎన్టీఆర్’ చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే.ఆ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ మొదటి షెడ్యూల్ పూర్తి అయ్యింది.రెండవ షెడ్యూల్‌ను త్వరలోనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఈ సమయంలోనే ఎన్టీఆర్ చిత్రంలో ఏయన్నార్ పాత్రను ఎవరు చేయబోతున్నారు అంటూ గత కొంత కాలంగా చర్చ జరుగుతుంది.
మహానటి చిత్రంలో ఏయన్నార్ పాత్రను నాగచైతన్య పోషించి మంచి మార్కులు కొట్టేశాడు.ఇప్పుడు అదే తరహాలో ఎన్టీఆర్‌లో కూడా నాగచైతన్య ఏయన్నార్‌గా కనిపిస్తాడని అంతా భావించారు.కాని అనూహ్యంగా ఏయన్నార్ పాత్రలో చైతూ కనిపించడం లేదు అంటూ క్లారిటీ వచ్చేసింది.
ఎన్టీఆర్ చిత్రంలో ఏయన్నార్ పాత్ర కోసం సుమంత్‌ను కూడా పరిశీలిస్తున్నట్లుగా ప్రచారం జరుగింది.
సుమంత అయితే బాలయ్యతో కరెక్ట్‌గా సూట్ అవుతాడని క్రిష్ భావిస్తున్నట్లుగా పుకార్లు షికార్లు చేశాయి.అయితే ఇప్పటి వరకు వచ్చినవన్ని కూడా పుకార్లే అని తేలిపోయింది.‘ఎన్టీఆర్’ చిత్రంలో అసలు ఏయన్నార్ పాత్ర ఉండబోదు అని, ఆ పాత్రను చేసేందుకు అక్కినేని ఫ్యామిలీ వారు ముందుకు వచ్చే అవకాశం లేదని, తనపై ఉన్న కోపంతో ఖచ్చితంగా నాగార్జున తన కొడుకు చైతూ లేదా అల్లుడు సుమంత్‌ను నటింపనివ్వడు అంటూ బాలకృష్ణ భావిస్తున్నాడు.అందుకే ఎన్టీఆర్ చిత్రంలో ఏయన్నార్ పాత్ర అవసరం లేదు అన్నట్లుగా దర్శకుడు క్రిష్‌తో చెప్పినట్లుగా తెలుస్తోంది.

మొదటి ఒకటి రెండు సీన్స్‌లలో ఏయన్నార్‌ను అనుకున్న దర్శకుడు క్రిష్ ఇప్పుడు ఆ సీన్స్‌ను లేపేసినట్లుగా తెలుస్తోంది.మొత్తానికి నాగార్జున పై బాలయ్యకు ఏ స్థాయిలో కోపం ఉందో ఈ సంఘటనతో తేలిపోయింది.ఎన్టీఆర్ చిత్రం వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతుంది.ఎన్టీఆర్ భార్య పాత్రలో విద్యాబాలన్ నటిస్తున్న విషయం తెల్సిందే.







