రెమ్యూనరేషన్ భారీగా తగ్గించుకుంటున్న సమంత.. కారణం చైతన్యనా?

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి సమంత నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇలా ప్రస్తుతం ఈమెకు తెలుగులో మాత్రమే కాకుండా బాలీవుడ్ లోనూ అలాగే తమిళంలో కూడా అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే సమంత పాన్ ఇండియా సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు.ఇదిలా ఉండగా ఈమెకు బాలీవుడ్ లోనూ అలాగే కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు వస్తున్నప్పటికీ సమంత ఎక్కువగా తెలుగు సినిమాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుస్తోంది.

తాజాగా సమంత సన్నిహితుల సమాచారం ప్రకారం సమంతకు తెలుగులో ఎక్కువ సినిమా అవకాశాలు వస్తున్నాయని తాను కూడా తెలుగు సినిమాలలోనే నటించడానికి ఆసక్తి చూపిస్తుందని వెల్లడించారు.ఇకపోతే తెలుగులో మంచి బ్యానర్ మంచి ప్రతిభావంతుడైన దర్శకుడు అయితే తాను తక్కువ రెమ్యూనరేషన్ తో కూడా నటించడానికి సిద్ధంగా ఉందని సమంత సన్నిహితులు వెల్లడిస్తున్నారు.

ఇలా సమంత తక్కువ రెమ్యూనరేషన్ తీసుకొని నటించడానికి గల కారణం ఏమిటి అనే విషయం గురించి అభిమానులు ఆరా తీస్తున్నారు.

Advertisement

సమంత కేవలం టాలీవుడ్ సినిమాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ తక్కువ రెమ్యూనరేషన్ అయిన నటిస్తానని చెప్పడం కేవలం నాగచైతన్య పై రివేంజ్ తీర్చుకోవడమేనని భావిస్తున్నారు.టాలీవుడ్ ఇండస్ట్రీలో తాను నాగచైతన్యకు పోటీగా తనకన్నా ఎక్కువ సినిమాలకు కమిట్ అవుతూ నాగచైతన్యను డామినేట్ చేయాలన్న ఉద్దేశంతోనే సమంత తన రెమ్యూనరేషన్ కూడా తగ్గించుకుందని వార్తలు వస్తున్నాయి.సమంత నాగచైతన్యత విడిపోయిన తర్వాత ఆయన గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే నాగచైతన్య మాత్రం ఎక్కడ తన గురించి ఎలాంటి నెగటివ్ కామెంట్ చేయకుండా తనపై ఎప్పటికీ రెస్పెక్ట్ ఉంటుందని చెప్పడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు