టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా సక్సెస్ అయినటువంటి వారిలో నటి సమంత ( Samantha ) ఒకరు.ఈమె ఏం మాయ చేసావ్ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో అద్భుతమైన వంటి విజయాన్ని సొంతం చేసుకున్నారు.
ఇలా ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి మొదటి సినిమానే మంచి సక్సెస్ కావడంతో ఈమెకు తెలుగులో సినిమా అవకాశాలు వచ్చాయి.ఇలా వరుస సినిమాలలో తెలుగు తమిళ భాష చిత్రాలలో స్టార్ హీరోలు అందరి సరసన నటిస్తూ పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు.
అయితే ఇటీవల కాలంలో సమంత సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్లలో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.ఇలా సినిమాలో పరంగా ఎంతో బిజీ అవుతున్నటువంటి తరుణంలో ఈమె తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
తన భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోవడం అనంతరం మయోసైటిసిస్ వంటి వ్యాధికి గురి కావడం వంటివి జరిగాయి.
ఇలా అన్ని బాధలను ఎదుర్కొంటూ ఉన్నటువంటి ఈమె ఇండస్ట్రీకి కాస్త విరామ ప్రకటించి పూర్తిగా తన ఆరోగ్యం పైన దృష్టి పెట్టారు.అయితే ఇప్పుడిప్పుడే ఈ వ్యాధి నుంచి సమంత బయట పడుతున్నారని తెలుస్తుంది.ఇలా ఈ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నటువంటి సమంత త్వరలోనే ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తుంది.
ఈమె త్వరలోనే సుకుమార్ (Sukumar) డైరెక్షన్లో రాంచరణ్ (Ramcharan)తో సినిమా చేస్తున్నారు ఆ సినిమాలో నటించబోతున్నారని, లేదు అట్లీ( Atlee ) డైరెక్షన్లో అల్లు అర్జున్ ( Allu Arjun ) తో కలిసి నటించబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.
ఇలా ఈమె రీ ఎంట్రీ గురించి ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయి.అయితే సమంత మాత్రం రీ ఎంట్రీ ఇవ్వాలి అంటే డైరెక్టర్లకు భారీ స్థాయిలో కండిషన్లు పెడుతున్నారని తెలుస్తుంది.ఈమె ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అయితే ఇప్పుడు మాత్రం సమంతను మించి నటించే హీరోయిన్లు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.
అయినప్పటికీ తనకు సినిమాలలో మాత్రం అవకాశం కల్పిస్తే మొదటి హీరోయిన్ ప్రాధాన్యత ఇవ్వాలని అలాగైతేనే నటిస్తాను తప్ప సెకండ్ హీరోయిన్ గా అయితే అసలు నటించనని తేల్చి చెబుతున్నారట.ఇలా కొంతమంది సమంత కండిషన్లకు షాక్ అవ్వగా మరికొందరు సమంత కండిషన్లకు ఒప్పుకొని తనకి మొదటి ప్రాధాన్యత ఇవ్వడానికి కూడా సిద్ధమవుతున్నారని సమాచారం.