నక్క తోక తొక్కిన సమంత.. ఆ క్రేజీ ప్రాజెక్ట్ లో ఈ బ్యూటీ హీరోయిన్ గా ఫిక్స్ అయ్యారా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత( Samantha ) గురించి మనందరికీ తెలిసిందే.మొన్నటి వరకు మయోసైటీస్ వ్యాధికి సంబంధించిన ట్రీట్మెంట్ ను తీసుకుంటూ సినిమాలకు దూరంగా గడిపిన సమంత ఏడాది పూర్తవడంతో ఇప్పుడు మళ్లీ సినిమాలలో బిజీ బిజీ అవ్వడానికి ప్రయత్నిస్తోంది.

 Samantha In Allu Arjun Atlee Movie, Samantha, Tollywood, Atlee Movie, Allu Arjun-TeluguStop.com

అందులో భాగంగానే ఒకవైపు ఫిట్నెస్ గురించి జాగ్రత్తలు తీసుకుంటూనే మరొకవైపు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.మయోసైటిస్ సైడ్ ఎఫెక్టుల నుంచి పూర్తిగా కోలుకున్న సమంత, ఇప్పుడు పూర్తి స్థాయిలో యాక్టివ్ అయింది.

Telugu Allu Arjun, Atlee, Kushi, Pushpa, Satyamurthy, Samantha, Tollywood-Movie

సోషల్ మీడియాలో ఆమె పెడుతున్న పోస్టులు, ఫొటోలు చూస్తుంటే గ్లామర్ హీరోయిన్ పాత్రలకు ఆమె రెడీ అనే విషయాన్ని ఇట్టే పసిగట్టచ్చు.ఆ సంకేతాలకు మరింత బలం చేకూరుస్తూ త్వరలోనే బిగ్ సర్ ప్రైజ్ ఇవ్వబోతోంది సమంత. ఒక భారీ బడ్జెట్ సినిమాతో ఆమె రీఎంట్రీ ఇవ్వబోతోంది.అల్లు అర్జున్, అట్లీ( Allu Arjun, Atlee ) సినిమా లాక్ అయిన సంగతి తెలిసిందే.

మరో వారం రోజుల్లో బన్నీ బర్త్ డే సందర్భంగా ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించబోతున్నారు.ఇందులో హీరోయిన్ గా సమంతను దాదాపు కన్ ఫర్మ్ చేసినట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

Telugu Allu Arjun, Atlee, Kushi, Pushpa, Satyamurthy, Samantha, Tollywood-Movie

కాగా బన్నీ-సమంతది సూపర్ హిట్ కాంబినేషన్.గతంలో వీళ్లిద్దరూ కలిసి సన్నాఫ్ సత్యమూర్తి( S/O Satyamurthy ) సినిమా చేశారు.ఆ తర్వాత బన్నీ నటించిన పుష్ప-1 సినిమాలో సమంత ఐటెం సాంగ్ చేసింది.అది పాన్ ఇండియా లెవెల్లో పెద్ద హిట్టయింది.అదేవిధంగా దర్శకుడు అట్లీ, సమంతది కూడా సూపర్ హిట్ కాంబినేషన్.అట్లీ దర్శకత్వంలో సమంత 2 సినిమాలు చేయగా ఆ సినిమాలో కూడా మంచి సక్సెస్ను సాధించాయి.

ఇప్పుడు ఎలా చూసుకున్నా కూడా సమంత అట్లీకి అలాగే బన్నీకి లక్కీచామ్ గానే చెప్పవచ్చు.బన్నీతో చేయబోయే సినిమా కోసం సమంతను తీసుకోవాలని అనుకుంటున్నారట.

సన్ పిక్చర్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించబోతున్నాయి.మరి ఈ విషయంపై పూర్తి వివరాలు తెలియాలి అంటే అల్లు అర్జున్ బర్త్ డే రోజు వరకు వేచి చూడాల్సిందే మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube