కళ్ళకు గంతలు కట్టి మరి దోసేలు తిరగేసిన చిరు!

తన అందంతో, నటన తో ఎంతో మంచి పేరు సంపాదించుకున్న అక్కినేని ఇంటి కోడలు సమంత.

ఎన్నో సినిమాలలో నటించి తన పాత్రలకు గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ అక్కినేని కోడలు అయ్యాక మంచి మంచి పాత్రలతో మరిన్ని సినిమాలు తీస్తూ తన అభిమానుల మనసును గెలుచుకుంటుంది.

తాజాగా ఓ షో ను ప్రారంభించగా అందులో తను చేసే అల్లరి అంతో.ఇంతో.

కాదు.కాగా ఈ షోలో చిరంజీవి పాల్గొనగా సమంత తన అల్లరితో, ప్రశ్నలతో ఓ ఆట ఆడేసింది.

గత కొన్ని రోజుల నుండి ఆహా ఓటిటి ను వేదిక చేసుకొని నాతో ఎంజాయ్ మెంట్ మామూలుగా ఉండదు అంటూ సమంత సామ్.జామ్.

Advertisement

అనే షో ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.కాగా ఈ షోలో ప్రత్యేకంగా నటీనటులను ఆహ్వానిస్తూ వాళ్ల జీవిత వ్యక్తిగత రహస్యాల గురించి ప్రశ్నలు వేస్తూ అల్లరిస్తుంది.

ఇటీవలే చిరంజీవి వచ్చిన ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో ను విడుదల చేయగా అందులో సమంత వేసిన ప్రశ్నలు చిరు ని ఆశ్చర్యపరిచింది.

కాగా ఈ ప్రోమో లో సమంత " మీరు ఏదైనా సినిమా చూసేటప్పుడు ఏడ్చారా?" అని చిరంజీవిని అడుగగా వెంటనే ఆయన ఏడ్చాను అంటూ.కిందకు వంగి కళ్ళు తుడుచుకొంటుండగా.లైట్ వేశారని లేచి చూసే సరికి పైట చేతిలో ఉందని నవ్వుతూ చెప్పాడు".

దీంతో వెంటనే సమంత మీరు అంత రొమాంటిక్ అనుకున్నారేమో! అని చిరంజీవిపై మాటని విసిరింది.దీంతో చిరంజీవి ఆశ్చర్యపోయారు.ఇదిలా ఉంటే చిరంజీవి గారికి దోశలు వేసే టాస్క్ ను సమంత ఇవ్వగా.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

మామూలుగా ఎవరైనా చేస్తారు.కానీ కళ్ళకు గంతలు కట్టి వేయడంలో ఆ మజానే వేరు అంటూ ఆ టాస్క్ లో పాల్గొని అలరించారు చిరంజీవి.

Advertisement

ఈ షో లో చేతులు లేని ఒక అబ్బాయి తన నోటితో చిరంజీవి బొమ్మను వేసి చిరంజీవితో పాటు ప్రేక్షకులను ఆకర్షించాడు.కాగా ఈ ఎపిసోడ్ క్రిస్మస్ సందర్భంగా రాగా.

ముందుగా ప్రోమో లను విడుదల చేశారు.

తాజా వార్తలు