మూడు నెలల్లో 'నోటరీ'లకు మోక్షం - జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్

రాజన్న సిరిసిల్ల జిల్లా: నోటరీ దస్త్రాల ఆధారంగా జరిగిన స్థలాల కొనుగోలు ఒప్పందాలను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం నిర్ణయించి, ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసిందనీ జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ అన్నారు.

తద్వారా కొనుగోలు చేసిన స్థలాలపై వాటి యజమానులకు హక్కులు దక్కనున్నట్లు చెప్పారు.

ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.ఈ ప్రక్రియలో భాగంగా ఈ నెల నుంచి అక్టోబరు 31 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపారు.

ఈ మూడు నెలల్లోనే క్రమబద్ధీకరణ పూర్తి చేస్తామని చెప్పారు.ఈ బాధ్యతలను జిల్లాల కలెక్టర్లకు అప్పగిస్తూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ మార్గదర్శకాలను జారీ చేశారన్నారు.

రౌడీ షీటర్స్ సత్ప్రవర్తనతో మెలగాలి - కోనరావుపేట ఎస్ఐ శేఖర్ రెడ్డి
Advertisement

Latest Rajanna Sircilla News