టైగర్ 3 కు డీసెంట్ రన్ టైం లాక్.. రిలీజ్ కు ఆల్ సెట్!

బాలీవుడ్ స్టార్ హీరోల్లో సల్మాన్ ఖాన్ ( Salman Khan ) ఒకరు.సల్మాన్ అంటే దేశ వ్యాప్తంగా సుపరిచితమే.

ఈయన సినిమా వస్తుంది అంటే హిందీ ఆడియెన్స్ లో పూనకాలే అని చెప్పాలి.ఒకప్పుడు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించిన సల్మాన్ కు ఈ మధ్య ఆ రేంజ్ హిట్ అనేది దక్కడం లేదు.

ఒక వైపు సీనియర్ హీరో కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ పఠాన్, జవాన్ సినిమాలతో ఒకే ఏడాదిలో రెండు వెయ్యి కోట్ల ప్రాజెక్టులను అందించి బాలీవుడ్ పరువు కాపాడి మళ్ళీ కింగ్ అని అనిపించు కున్నాడు.అయితే సల్మాన్ ఖాన్ కూడా ఆ రేంజ్ హిట్ అందుకోవాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

మరి ఈ క్రమంలోనే ఈయన ప్రస్తుతం చేస్తున్న సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.సల్మాన్ ఖాన్ తాజాగా నటించిన లేటెస్ట్ మూవీ టైగర్ 3( Tiger 3 ) .ఈ సినిమా రిలీజ్ కు సిద్ధం అయ్యింది.ఈ సినిమా కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Advertisement

టైగర్ ఫ్రాంచైజీగా వస్తున్న ఈ సినిమాపై భారీ హోప్స్ ఉన్నాయి.

యష్ రాజ్ ఫిలిమ్స్ తన స్పై యూనివర్స్ లో టైగర్ 3 ను చేర్చడంతో బాలీవుడ్ లో అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి. దీపావళి కానుకగా నవంబర్ 12న రిలీజ్ కాబోతుండడంతో ఈ సినిమా రిలీజ్ కు అన్ని పనులు పూర్తి చేసుకుంటుంది.ఈ సినిమా రన్ టైం తాజాగా బయటకు వచ్చింది.

టైగర్ 3 టోటల్ రన్ టైం 2 గంటల 35 నిముషాలు అని తెలుస్తుంది.తక్కువ రన్ టైం కావడంతో పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే ఇది రికార్డ్ కలెక్షన్స్ రాబట్టడం ఖాయం.

కత్రినా కైఫ్( Katrina Kaif ) హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను మనీష్ శర్మ తెరకెక్కించాడు.అంతేకాదు ఈ సినిమాలో షారుఖ్ ఖాన్( Shah Rukh Khan ) క్యామియో రోల్ లో కనిపించనుండడంతో ఎలా ఉంటుందా అని అంతా ఎదురు చూస్తున్నారు.

ఆ విధంగా జరగకపోతే ప్రమాదంలో కళ్యాణ్ రామ్ కెరీర్.. ఆ రేంజ్ హిట్ అందుకుంటారా?
Advertisement

తాజా వార్తలు