'సలార్' కొత్త రిలీజ్ డేట్.. అప్పటికి ఫిక్స్ చేస్తున్న మేకర్స్!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్( Young Rebel Star Prabhas ) హీరోగా తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్టులలో సలార్( Salaar ) ఒకటి.

సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ రెండు పార్టులుగా తెరకెక్కుతుండగా మొదటి పార్ట్ ను సెప్టెంబర్ 28న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.

మరో నెలలో రిలీజ్ అవుతుంది అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్ తెలిసింది.

Salaar Movie New Release Date, Salaar, Salaar Release Date, Prabhas, Prashanth N

ఈ సినిమా వాయిదా పడుతుంది అని అఫిషియల్ గా ప్రకటించక సోషల్ మీడియాలో మాత్రం ప్రచారం జరుగుతుంది.యూనిట్ నుండి ఈ రూమర్స్ పై ఎటువంటి స్పందన లేకపోవడంతో రిలీజ్ వాయిదా పడింది అని ఫ్యాన్స్ కూడా కన్ఫర్మ్ అయ్యారు.అయితే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్, విఎఫ్ఎక్స్ పనులు విషయంలో నీల్( Director Prashant Neel ) సంతృప్తిగా లేకపోవడంతో రిలీజ్ డేట్ వాయిదా పడినట్టు టాక్ వినిపిస్తుంది.

సలార్( Salaar Release Date ) పోస్ట్ పోన్ అవ్వడంతో ఫ్యాన్స్ పూర్తిగా నిరాశ వ్యక్తం చేస్తున్నారు.ఆదిపురుష్ వంటి ప్లాప్ ను మరిపించే హిట్ కొట్టడం ఖాయం అని ఫ్యాన్స్ ఎదురు చూస్తుండగా ఈ సినిమా వాయిదా అని తెలిసింది.

Advertisement
Salaar Movie New Release Date, Salaar, Salaar Release Date, Prabhas, Prashanth N

వచ్చే ఏడాది సంక్రాంతి రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచలో మేకర్స్ ఉన్నట్టు తెలుస్తుంది.కానీ ఆ సమయంలో కాంపిటీషన్ ఎక్కువుగా ఉంటుంది.

Salaar Movie New Release Date, Salaar, Salaar Release Date, Prabhas, Prashanth N

ఆ సమయంలో సౌత్ లో ఉన్నంత డిమాండ్ నార్త్ లో ఉండదు.అందుకే రిలీజ్ ఎప్పుడు ప్లాన్ చేయాలా అని మేకర్స్ ఆలోచిస్తున్నారట.ముఖ్యంగా దీపావళికి కానీ క్రిస్మస్ సమయంలో కానీ రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది అని కూడా ఆలోచిస్తున్నారట.

అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా నవంబర్ 3న కానీ 10న కానీ రిలీజ్ చేయాలని కొత్త డేట్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.దీంతో దీపావళికి( Salaar Diwali Release ) సలార్ వస్తాడు అనే టాక్ వినిపిస్తుంది.

మరి అప్పుడు రిలీజ్ చేస్తారో లేదంటే డిసెంబర్ కు ప్లాన్ చేసుకుంటారో వేచి చూడాలి.ఏది ఏమైనా ఈ సినిమా అయిన ప్రభాస్ కు హిట్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

'రుద్ర' గా ప్రభాస్ కొత్త పోస్టర్ వైరల్!
కూలీ కోసం బుట్ట బొమ్మ... కళ్ళు చెదిరే రేంజిలో రెమ్యూనరేషన్?

కాగా ఈ సినిమాలో శృతి హాసన్( Shruti Haasan ) హీరోయిన్ గా నటిస్తుండగా.హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో సినిమాను నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు