Sriya Reddy: 21 ఏళ్ల సినిమా జీవితంలో చేసింది 14 సినిమాలు..వయసేమో 41

శ్రీయ రెడ్డి.( Sriya Reddy ) సలార్ సినిమా తర్వాత అందరూ ఈ సినిమాలో నటించిన శ్రీయ రెడ్డి గురించి మాట్లాడుతున్నారు.

వాస్తవానికి శ్రీయా రెడ్డి నిన్న మొన్న ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఏమీ కాదు.ఆమె సినిమా ప్రయాణానికి 21 వయసు ఉంది.

ఆమెకి కూడా ఒక 41 ఏళ్ల వయసు ఉంది.కానీ చేసింది మాత్రం పట్టుమని 14 సినిమాలు మాత్రమే.2005లో ఒక పోలీస్ అధికారి పాత్రలో నటిస్తే అప్పుడు మరొక విజయశాంతి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది అనుకున్నారు.ఇప్పుడు సలార్ లో( Salaar ) ఆమె విలనీ పాత్ర పోషిస్తే అందరూ మరో రమ్యకృష్ణ లేదా మరో శివగామి అంటున్నారు.

హీరోయిన్ గా పెద్ద సక్సెస్ కాలేదు కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇంత పెద్ద సక్సెస్ అందుకున్న శ్రీయ రెడ్డి ప్రయాణం అంతా ఆషామాషీగా ఏమీ లేదు.నిజానికి సలార్ సినిమాలో ప్రభాస్( Prabhas ) పృధ్విరాజ్ ప్రశాంత్ నీల్ కన్నా కూడా శ్రీయ రెడ్డి కి మంచి పేరు వచ్చింది.

Advertisement

ఇక హీరోయిన్ శృతి హాసన్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు.ఖచ్చితంగా శ్రీయ రెడ్డి కి ఇది ఒక మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా అని చెప్పొచ్చు.

అయితే ఇప్పుడు అందరూ శ్రీయ రెడ్డి గురించి అంతా ఒకటే అనుకుంటున్నారు.ఆమె మరో శివగామి లాగా మంచి పవర్ఫుల్ పాత్ర చేసిందని, సలార్ కు ఆమె శివగామి( Shivagami ) అని అంటున్నారు.అప్పుడు విజయశాంతిని( Vijayashanti ) డామినేట్ చేసినట్టుగానే ఇప్పుడు రమ్యకృష్ణ ను( Ramya Krishna ) కూడా డామినేట్ చేసేంత పవర్ఫుల్ పాత్రను పోషించ గల కెపాసిటీ శ్రీయ రెడ్డి కి ఉంది అని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు.

అయితే ఆమె మొదటి నుంచి సినిమా ఇండస్ట్రీ పై ఫోకస్ చేసినప్పటికీ అవకాశాలు పెద్దగా తలుపు తట్టలేదు.తెలుగులో కూడా ఒకటి అరా చేసినప్పటికీ అవి వర్కౌట్ అవ్వలేదు.ఇక విశాల్ అన్నయ్య విక్రం కృష్ణతో( Vikram Krishna ) ప్రేమలో పడి పెళ్లి చేసుకొని దాదాపు 10 ఏళ్ల పాటు ఇండస్ట్రీ నుంచి దూరమైంది.

ఇప్పుడు చిరంజీవితో ఒక సినిమా, అలాగే పవన్ కళ్యాణ్ తో ఓజి సినిమాలో కూడా నటిస్తోంది.శ్రీయ రెడ్డి ముందు ముందు మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, పవర్ ఫుల్ లేడీ విలన్ గా సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలో సెటిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు