ఏపీ సీఈవో ముఖేశ్ కుమార్ మీనా( CEO Mukesh Kumar Meena )ను టీడీపీ నేత అచ్చెన్నాయుడు లేఖ రాశారు.ఈ మేరకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై అచ్చెన్నాయుడు ఫిర్యాదు చేశారు.
సజ్జల( Sajjala Ramakrishna Reddy ) ప్రభుత్వ సలహాదారుగా విధులు నిర్వర్తిస్తూ రాజకీయ నేతలా మాట్లాడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.విపక్ష పార్టీలపై సజ్జల తీవ్రమైన ఆరోపణలు చేశారన్న అచ్చెన్నాయుడు ఇది ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించడమే అవుతుందని లేఖలో తెలిపారు.ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించిన సజ్జలపై ఎన్నికల సంఘం తగిన చర్యలు తీసుకోవాలని సీఈవోను అచ్చెన్నాయుడు కోరారు.