వివేకా హత్య కేసుకు సంబంధించి ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోంది.. సజ్జల రామకృష్ణారెడ్డి

తాడేపల్లి: వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.వివేకా హత్య కేసుకు సంబంధించి ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోంది.

ఛార్జిషీట్ పేరుతో తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారు.సత్య దూరమైన, అసంబద్ధ కథనాలు ప్రచారం చేస్తున్నారు.

వైఎస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి వివేకా.వివేకా హత్య ఘటన వైఎస్ జగన్ ను బాగా కుంగదీసింది.

సీబీఐ ఛార్జిషీట్ హేతుబద్ధంగా లేకుండా కథనంలా ఉంది.ఎంపీ టికెట్ కోసం వివేకా హత్య జరిగిందనే కోణంలో ఛార్జిషీట్ లో కథనం రాయడం పూర్తి అసంబద్ధం.

Advertisement

చనిపోవడానికి ఒక్కరోజు ముందుకూడా అవినాష్ రెడ్డిని ఎంపీగా గెలిపించేందుకు వివేకా కృషి చేశారు.నాడు వివేకా హత్యకు ఎంత కుట్ర చేశారో నేడు అంతకంటే ఎక్కువ కుట్ర జరుగుతోంది.

ఛార్జ్ షీట్ పేరుతో సంబంధం లేని వ్యక్తులపై కుట్ర.హత్య అని తెలియజేసే లేఖను సాయంత్రం వరకు ఎందుకు బయటపెట్టలేదు.

మార్చి 15న ఘటన జరిగినప్పటి నుంచి మే 30 వరకు టీడీపీ ప్రభుత్వమే ఉంది.వైసీపీ ప్రభుత్వం వచ్చాక కూడా అదే అధికారులు కంటిన్యూ అయ్యారు.

అందరూ వివేకా కేసులో వాస్తవాలు బయటకు రావాలని కోరుకుంటున్నారు.సీబీఐ కూడా పథకం ప్రకారం వైసీపీ నేతలను ఇరికించే కుట్ర చేస్తోంది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని అప్రతిష్టపాలు చేసే కుట్ర.సీబీఐ ఛార్జిషీట్ పై కచ్చితంగా ఛాలెంజ్ చేస్తాం, ప్రజలకు వాస్తవాలు తెలియాలి.

Advertisement

బాధితులనే దోషులుగా చిత్రీకరించే కుట్ర జరుగుతోంది.ప్రతిదాన్నీ రాజకీయం చేయడం టీడీపీకి అలవాటే.

వివేకా హత్య ఘటన వెనుక టీడీపీ హస్తం ఉండి ఉంటుంది.

తాజా వార్తలు