AP: విజయవాడలోని మూడు అసెంబ్లీ స్థానాల అభ్యర్థులను వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు.ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న సజ్జల ఈ మేరకు ప్రకటన చేశారు.
వచ్చే ఎన్నికల్లో శ్రీనివాస్ ని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి, విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి అవినాష్, విజయవాడ సెంట్రల్ నుంచి మల్లాది విష్ణులను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.







