కింద పడ్డా తమదే పై చెయ్యి అంటున్న సకల శాఖ మంత్రి గారు

కాలం కలిసి రాక ఎదురు దెబ్బలు తగులుతున్నప్పుడు ఎవరైనా ఏం చేస్తారు? పరిస్థితులను అర్థం చేసుకొని ఎక్కడ తప్పు జరుగుతుందో విశ్లేషించుకుని ఓపికగా విజయం కోసం ప్రణాళికలు రచించుకుంటారు అవకాశం కోసం ఎదురు చూస్తారు .అందుకు ఉదాహరణగా చంద్రబాబు( Chandrababu ) ను తీసుకోవచ్చు 70 సంవత్సరాల వయసులో రాజకీయంగా ఇన్ని ఎదురు దెబ్బలు తింటూ తీవ్రమైన అవమానాలు ఎదురైనా కూడా మొక్కవోని పట్టుదలతో తమ శక్తి యుక్తులను కూడదీసుకుంటూ ఓపిగ్గా ఎదురుచూసి, సరయిన వ్యూహాలను అమలు చేసి కావలసిన ఫలితాలను పొందారు… కానీ సజ్జల సార్ తీరు చూస్తుంటే ఓటమిని నిజాయితీగా ఒప్పుకొని అందుకు గల కారణాలు విశ్లేషించడం తర్వాత సంగతి అసలు తమది ఓటమి కాదని టిడిపి( TDP )కి విజయమే కాదని అంటున్న ఆయన మాటలు చూస్తుంటే వారు ఓటమి నుంచి ఏ విధమైన గుణపాఠం నేర్చుకున్నట్టు కనిపించడం లేదు.

 Sajjala Not Accepting Defeat Has Bad Sign For Ycp ,ycp ,sajjala, Chandrababu, T-TeluguStop.com
Telugu Chandrababu, Mlas, Sajjala, Welfare Schemes-Telugu Political News

పట్టభద్రులు తమ ఓటు బ్యాంకు కాదని వీరు సంక్షేమ పథకాల( Welfare schemes ) ఫలితాలు సరిగ్గా పొందలేదు కాబట్టి వీరికి పార్టీ పట్ల అభిమానం ఉండే అవకాశం లేదు కాబట్టి ఈ ఎన్నికలలో మేము సరైన ఫలితాలు పొందలేదు అని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలప్పుడు మీడియా సమావేశంలో సజ్జల సెలవిచ్చారు.మరి ఇప్పుడు తమ సొంత ఎమ్మెల్యేలు గీత దాటి మరీ ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే కూడా ఇంకా చంద్రబాబు పై విమర్శలు చేయడం ఎంత వరకూ కరెక్టు అన్నది ఆయన ఆలోచించుకోవాలి .నిజానికి మన బంగారం మంచిదైతే ఎదుటివారి మీద విమర్శలు చేయనవసరం లేదు.

Telugu Chandrababu, Mlas, Sajjala, Welfare Schemes-Telugu Political News

ఏ రాష్ట్రంలోనూ లేనంత బలమైన మెజారిటీ ఉన్న రాష్ట్రంలో,అది కూడా పకడ్బందీగా వ్యూహాలు సిద్ధం చేసుకుని అందుకు అవసరమైన మాక్ డ్రిల్ కూడా రెండుసార్లు నిర్వహించి, ఎమ్మెల్యేలను బుజ్జగించటానికి మంత్రులు స్థాయి కమిటీని ఏర్పాటు చేసుకున్నా కూడా ఎమ్మెల్యేలు చేయి జారిపోతున్నారు అంటే ఎమ్మెల్యే లో ఉన్న అసంతృప్తిని పట్టించుకోవడం మానేసి ప్రతిపక్ష పార్టీలను తిట్టడం ఏమాత్రం సబబో సజ్జల సార్ ఆలోచించుకోవాలి.ఇప్పటికైనా పార్టీ పైన ప్రభుత్వం పైన ప్రజలలోను ఎమ్మెల్యేల లోనూ రగులుతున్న అసంతృప్తిని అర్థం చేసుకొని దాన్ని తగ్గించుకునే విధంగా చర్యలు తీసుకోకపోతేప్రతిపక్ష పార్టీలు చెబుతున్నట్టు వైసిపి కి నైతిక పతనం మొదలైందనే చెప్పవచ్చు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube