సాధారణంగా సెలబ్రిటీలలో చాలామంది ఎక్కడికి వెళ్లినా ఊహించని స్థాయిలో హడావిడి చేస్తారు.చుట్టూ బౌన్సర్లతో అభిమానులను నెట్టేస్తూ కొంతమంది సెలబ్రిటీల బౌన్సర్లు చేసే హడావిడి మామూలుగా ఉండదని కామెంట్లు వినిపిస్తూ ఉంటాయి.
అయితే చాలా విషయాలలో ఇతర హీరోయిన్లకు భిన్నంగా వ్యవహరించే సాయిపల్లవి తాజాగా సాధారణ భక్తురాలిలా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
పుట్టపర్తిలో భక్తులతో కలిసిపోయిన సాయిపల్లవి ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
పుట్టపర్తి సాయిబాబా భక్తురాలైన సాయిపల్లవి దేవుని చింతనలో కొత్త సంవత్సరం వేడుకలను జరుపుకోవడంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.గతేడాది సాయిపల్లవి నటించిన సినిమాలకు క్రిటిక్స్ నుంచి ప్రశంసలు దక్కినా కమర్షియల్ గా ఆ సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి.
కమర్షియల్ అంశాలు ఉన్న సినిమాలకు సాయిపల్లవి ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.సావిత్రి, సౌందర్య, స్నేహ తర్వాత ట్రెడిషనల్ రోల్స్ తో మంచి పేరును సంపాదించుకున్న హీరోయిన్ల జాబితాలో సాయిపల్లవి నిలిచారు.
కొత్త సంవత్సరం సందర్భంగా పుట్టపర్తిలో దేవుని కార్యక్రమాలు జరగగా ఆ కార్యక్రమాలలో సాయిపల్లవి పేర్కొన్నారు.సాయిపల్లవి మాస్క్ ధరించడంతో భక్తులు ఆమెను గుర్తు పట్టలేకపోయారు.

మరోవైపు సాయిపల్లవి ఇకపై డాక్టర్ గా కెరీర్ ను కొనసాగిస్తారని వార్తలు వినిపిస్తుండగా ఈ వార్తల గురించి సాయిపల్లవి నుంచి ఎలాంటి స్పష్టత లేదు.సాయిపల్లవి సినిమాలకు దూరమైతే మాత్రం అస్సలు తట్టుకోలేమని ఫ్యాన్స్ చెబుతున్నారు.ఇతర హీరోయిన్లతో పోలిస్తే సాయిపల్లవి ప్రాజెక్ట్ లు భిన్నంగా ఉంటాయి.సాయిపల్లవి ప్రతి సంవత్సరం పుట్టపర్తికి వస్తారనే సంగతి తెలిసిందే.సాయిపల్లవి తల్లి కూడా సాయిబాబా భక్తురాలు కావడం గమనార్హం.ఇంతకాలం యాడ్స్ కు దూరంగా ఉన్న సాయిపల్లవి త్వరలో ఒక యాడ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.







