ఏపీ సీఎం జగన్ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు.ఈనెల 3వ తేదీన రాజమహేంద్రవరంలో పర్యటన కొనసాగనుంది.
ఈ క్రమంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుకను జగనే స్వయంగా లబ్ధిదారులకు అందించనున్నారు.
లబ్ధిదారులకు ఇచ్చే పెన్షన్ మొత్తాన్ని పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.ఆదివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పెంచిన పెన్షన్ మొత్తం రూ.2,750 ని లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు.మరోవైపు సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో అప్రమత్తమైన అధికార యంత్రాంగం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.







