మహేష్ కి జోడీగా తెరపైకి ఆ బాలీవుడ్ భామ పేరు

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో సర్కారు వాటి పాట సినిమాని త్వరలో సెట్స్ పైకి తీసుకొని వెళ్ళబోతున్నాడు.

ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ప్రేక్షకుల ముందుకి వచ్చి విపరీతంగా ట్రెండ్ అయ్యింది.

ఇక సెలబ్రిటీలు సైతం ఈ సినిమా టైటిల్ పై ప్రశంసలు కురిపించారు.మహేష్ లో ఎన్నడూ చూడని మాస్ యాంగిల్ లో ఈ సినిమాలో పరశురాం చూపించబోతున్నాడు అనే టాక్ బలంగా వినిపిస్తుంది.

ఇక ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండబోతుంది అనే మాట కూడా వినిపిస్తుంది.ఇక ఇందులో హీరోయిన్ గా భరత్ అనే నేనులో మహేష్ తో ఆడిపాడిన కైరా అద్వానీని ఫైనల్ చేసారని టాక్ వినిపించింది.

ఇప్పడు కియారా ప్లేస్ లో మరో పేరు వినిపిస్తోంది.బాలీవుడ్ నటుడు, దర్శకుడు అయిన మహేశ్ మంజ్రేకర్ కుమార్తె సాయి మంజ్రేకర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించనుందన్నది టాలీవుడ్ వర్గాల భోగట్టా.

Advertisement

ఇప్పటికే చిత్ర యూనిట్ సాయిని సంప్రదించిందని, ఆమె ఒప్పుకుందని కూడా తెలుస్తోంది.ఈ విషయంలో అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు.

సాయి మంజ్రేకర్ వరుణ్ తేజ్ కిరణ్ కొర్రపాటి సినిమాలో కూడా ఇప్పటికే హీరోయిన్ గా ఫైనల్ అయ్యింది.బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ దబాంగ్ 3 చిత్రం ద్వారా ఈ భామ తెరంగేట్రం చేసింది.

మొత్తానికి తెలుగులో మొదటి సినిమా కూడా రిలీజ్ కాకుండానే ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ కి జోడీగా అవకాశం కొట్టేసింది అనే మాట ఇప్పుడు గట్టిగా వినిపిస్తుంది.

తెలంగాణ కాంగ్రెస్ ప్రక్షాళన .. ఆమెనూ తప్పిస్తున్నారా ? 
Advertisement

తాజా వార్తలు