ఇండస్ట్రీలో ఎంతోమంది సెలబ్రిటీలు ఒకే స్కూల్లో చదువుతూ క్లాస్మేట్స్ గా ఉండేవారు.అయితే ఇప్పుడు వారంతా కూడా సెలబ్రిటీగా ఇండస్ట్రీలోకి వచ్చారు.
ఈ క్రమంలోనే వారి స్కూల్ టైం లో క్లాసులో జరిగిన కొన్ని సంఘటనలను అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటారు.ఇలా రానా, అల్లు శిరీష్ శర్వానంద్ రామ్ చరణ్ ఇలాంటి హీరోలందరూ కూడా ఒకే క్లాస్మేట్స్ అనే సంగతి మనకు తెలిసింది.
అయితే సాయి ధరమ్ తేజ్, కలర్స్ స్వాతి కూడా ఓకే క్లాస్మేట్స్ అనే విషయం తాజాగా బయటపడింది.సాయి ధరంతేజ్( Sai Dharam Tej ) కలర్స్ స్వాతి(Swathi ) డిగ్రీలో వీరిద్దరూ క్లాస్మేట్స్ అంటూ సాయి ధరంతేజ్ వెల్లడించారు.

నవీన్ చంద్ర ( Naveen Chandra ) కలర్స్ స్వాతి జంటగా నటించిన మంత్ ఆఫ్ మధు( Month Of Madhu ) అనే సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.ఈ క్రమంలోనే ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ను ముఖ్యఅతిథిగా ఆహ్వానించారు.అయితే ఈ వేదికపై వీరిద్దరూ ఎంతో చనువుగా ఉండటం చూసి అందరూ ఇంత మంచి స్నేహితుల అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
వీరి కాలేజీలో జరిగిన కొన్ని సంఘటనల గురించి కూడా ఈ సందర్భంగా తెలియజేశారు.

కలర్స్ స్వాతి మాట్లాడుతూ సాయిధరమ్ తేజ్ తాను ఇద్దరు డిగ్రీల క్లాస్మేట్స్( Classmates ) అని తెలిపారు.ఇద్దరు పేర్లు ఎస్ తో మొదలవడం వల్ల నా వెనక్కి ఆయన ఉండేవారు అయితే పరీక్షలలో కూడా నా పేపర్లో చూసి కాపీలు కొట్టి పాస్ అయ్యారు అంటూ తెలిపారు.స్వాతి ఇలా చెప్పడంతో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ తన పేపర్లో చూసి కాపీ కొట్టి పాస్ అయ్యానని అయితే చాలా బాగా ఏడిపించేదని అసలు చూపించేది కాదు అంటూ సాయి ధరమ్ తేజ్ తెలిపారు.
ఇక ప్రాక్టికల్ పరీక్షలలో కూడా రిజల్ట్ అడిగిన చెప్పేది కాదని నన్ను బాగా ఏడిపించింది అంటూ ఈ సందర్భంగా వారిద్దరి మధ్య ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ గురించి సాయి ధరమ్ తేజ్ వెల్లడించారు.







