సాయి పల్లవి ఏంటి ఇలాంటి డెసీషన్ తీసుకుంది ?

సాయి పల్లవి అంటే తెలియని వారు ఉండరేమో.అంతగా అభిమానుల మనుసులో స్థానం సంపాదించుకుంది.

 Sai Pallavi Takes A Shocking But Wise Career Decision, Sai Pallavi, Love Story,-TeluguStop.com

కేవలం టాలీవుడ్ ప్రేక్షకుల మదిలో మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా సాయి పల్లవి అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదేమో.ఈమె డాన్స్ కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.

డాన్స్ మాత్రమే కాదు తన నటన కూడా అద్భుతంగా ఉంటుంది.

అందరి హీరోయిన్స్ లాగా ఏ క్యారెక్టర్ పడితే అది చేయదు.

తనకు నచ్చితేనే ఓకే చెబుతుంది.ఎంత స్టార్ హీరో సినిమా అయినా సాయి పల్లవి నో చెప్పిన సందర్భాలు ఉన్నాయి.

ఇటీవలే సాయి పల్లవి, నాగ చైతన్య జంటగా నటించిన లవ్ స్టోరీ సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది.ఈ సినిమాలో తన నటనతో మరొకసారి సూపర్బ్ అనిపించింది సాయి పల్లవి.

ఈ సినిమాలో నాగ చైతన్య, సాయి పల్లవి జంట సూపర్ అంటూ కామెంట్స్ వచ్చాయి.కరోనా తర్వాత లవ్ స్టోరీ సినిమాతోనే టాలీవుడ్ లో థియేటర్స్ కళకళ లాడుతున్నాయి.

ప్రెసెంట్ సాయి పల్లవి లవ్ స్టోరీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తుంది.ఇక ఈమె చదువు విషయానికి వస్తే.

ఈమె జార్జియా యూనివర్సిటీ నుండి పట్టా అందుకుని డాక్టర్ గా సేవలు అందించడానికి సిద్ధం అయ్యింది.

Telugu Love Story, Sai Pallavi, Saipallavi-Movie

అయితే తాజాగా సాయి పల్లవి ఒక షాకింగ్ డెసిషన్ తెలిపింది.మీడియాతో జరిగిన ఇంటరాక్షన్ లో సాయి పల్లవి మాట్లాడుతూ.తన చుట్టూ ఉన్న వ్యక్తులకు సహాయం చేయడం కోసం డాక్టర్ వృత్తిని చేపట్టాలని అనుకుంటున్నట్టు తెలిపింది.

అయితే డాక్టర్ వృత్తిని చేస్తూనే తనకు ఛాలెంజింగ్ రోల్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా నటిస్తానని తెలిపింది.ఈ డెసిషన్ అభిమానులకు షాకింగ్ గా ఉంది.సాయి పల్లవి ఇక సినిమాల్లో నటించదేమో అని ఆందోళన చెందుతున్నారు.ప్రస్తుతం అయితే సాయి పల్లవి నాని శ్యామ్ సింగరాయ సినిమాలో నటిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube