ఫిదా సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి సాయి పల్లవి.మొదటి సినిమాతోనే ఎంతో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈమె అనంతరం వరుసగా తెలుగు తమిళ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
ఈ క్రమంలోనే సాయి పల్లవి నటించిన గార్గి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇక ఎప్పటిలాగే సాయి పల్లవి తన నటనతో మరోసారి అందరినీ కట్టిపడేసింది.
ఈ సినిమా మొదటి షో నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో సాయి పల్లవి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సినిమా గురించి ఆమె ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఇకపోతే తాజాగా ఇంటర్వ్యూ సందర్భంగా సాయి పల్లవి తన గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.సాధారణంగా తాను ఎవరిపై కోపం తెచ్చుకోనని తెలిపారు.
తనకు ఎప్పుడూ కోపం రాదని కానీ ఎవరైనా తాను పనుకున్నప్పుడు డిస్టర్బ్ చేస్తే మాత్రం తనకు పట్టరాని కోపం వస్తుందని సాయి పల్లవి ఈ సందర్భంగా తన కోపం గురించి వెల్లడించారు.
ఇలా తనని నిద్ర డిస్టర్బ్ చేసినప్పుడు తప్ప తనకు ఎప్పుడు కోపం రాదని సాయి పల్లవి ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.నిజమే మరి సాయి పల్లవి ఎప్పుడు చూసినా చిరునవ్వుతో అందరిని పలకరిస్తూ ఉంటారు.ఇలాంటి ఈ ముద్దుగుమ్మ నిద్రపోయేటప్పుడు డిస్టర్బ్ చేస్తే మాత్రం సహించని చెప్పేశారు.
ప్రస్తుతం సాయి పల్లవి కోపం గురించి చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.