సంపాదనలో టాప్ హీరోయిన్ల సరసన చేరిన సాయి పల్లవి..

తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం సాయి పల్లవి హవా కొనసాగుతుంది.

శేఖర్ కమ్ముల ఫిదా సినిమాతో తెలుగు జనాలకు పరిచయం అయిన తమిళ బ్యూటీ సాయి పల్లవి తన అద్భుతమైన అభినయంతో బాగా ఆకట్టుకుంది.

అచ్చం తెలుగు అమ్మాయిలా కనిపించే ఈ అమ్మడు టాలీవుడ్ లో తక్కువ సినిమాలు చేసినా మంచి గుర్తింపు తెచ్చుకుంది.ప్రస్తుతం వరుస అవకాశాలతో టాప్ హీరోయిన్ గా ముందుకు సాగుతుంది.

తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో చేస్తుంది.యంగ్ హీరోలు ఈమెతో సినిమాలు చేసేందుకు ఎదురు చూస్తున్నారు కూడా.

ప్రస్తుతం సాయి పల్లవి తెలుగులో విరాట పర్వం అనే సినిమా చేస్తుంది.ఈ సినిమాకు వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నాడు.

Advertisement

నక్సలైట్స్ నేపథ్యంలో ఈ సినిమా వస్తుంది.ఇందులో పేదింటి అమ్మాయిలా కనిపిస్తుంది.

అటు నాని శ్యామ్ సింగ రాయ్ సినిమాలో దేవదాసి పాత్రలో నటిస్తుంది.అటు చాలా కాలం తర్వాత తెలుగు సినిమా పరిశ్రమలో జోష్ నింపిన సినిమా లవ్ స్టోరీ.

ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ సాధించింది.మంచి వసూళ్లను సాధించింది.

ఇందులో తన చక్కటి నటనతో జనాలను బాగా ఆకట్టుకుంది సాయి పల్లవి.

నిత్యం ఈ పొడిని తీసుకుంటే కళ్ళ‌జోడుకు మీరు శాశ్వతంగా గుడ్ బై చెప్పొచ్చు!
చిరంజీవి విలన్ గా బాలీవుడ్ నటుడు..  మేకర్స్ పోస్ట్ వైరల్!

మంచి క్రేజ్ సంపాదించుకున్న సాయి పల్లవి సంపాదన కూడా భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది.సమంతా, అనుష్క రేంజికి ఈమె సంపాదన చేరినట్లు తెలుస్తోంది.సాయి పల్లవి సినిమాకు కోటి రూపాయల నుంచి కోటిన్నర తీసుకుంటుందట.2021లో సాయి పల్లవి 3 మిలియన్ డాలర్లు సంపాదించిందట.మొత్తంగా అనుష్క, సమంత, కాజల్ సరసన చేరిందట.

Advertisement

అయితే పలు కమర్షియల్ యాడ్స్ లో నటించే అవకాశం వచ్చినా తను చేయలేదట.జనాలను మోసం చేసే అబద్దపు ప్రకటనల్లో తాను నటించబోనని తేల్చి చెప్పిందట.ఒక వేళ ఆ యాడ్స్ కనుక చేసి ఉంటే ఈమె సంపాదన మరింత పెరిగేది.

కానీ తను ఏమాత్రం ఆలోచించకుండా నో చెప్పిందట.

" autoplay>

తాజా వార్తలు