సినిమా ఇండస్ట్రీలో అభినయానికి ప్రాధాన్యత ఉన్న సినిమాలనే ఎంచుకుంటూ పెద్దగా హిట్లు లేకపోయినా వరుస అవకాశాలతో బిజీగా ఉన్నారు సాయిపల్లవి.ప్రస్తుతం సాయిపల్లవి హీరోయిన్ గా లవ్ స్టోరీ, విరాటపర్వం 1992, శ్యామ్ సింగరాయ్ సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలు తెరకెక్కుతున్నాయి.
అయితే అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో సాయిపల్లవి బన్నీ చెల్లెలి పాత్రలో నటించనుందని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.
నిజానికి వరుసగా హీరోయిన్ ఆఫర్లతో బిజీగా ఉన్న హీరోయిన్లు స్టార్ హీరోల సినిమాల్లో చెల్లి, ఇతర పాత్రల్లో నటించడానికి పెద్దగా ఇష్టపడరు.
అయితే సాయిపల్లవి తన పాత్ర నచ్చితే మాత్రం ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి అంగీకరిస్తుంది.పుష్ప సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్నా నటిస్తుండగా అల్లు అర్జున్ కు చెల్లెలిగా సాయిపల్లవి నటిస్తుందో లేదో తెలియాలంటే మాత్రం కొన్ని రోజులు ఆగాల్సిందే.

సాయిపల్లవి చెల్లి పాత్రలో నటిస్తే మాత్రం భవిష్యత్తులో స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్ ఆఫర్లు వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి.సాయిపల్లవి ఈ వార్తపై స్పందిస్తే మాత్రం ఈ వార్త నిజమో అబద్ధమో తెలుస్తుంది.ఆర్య, ఆర్య 2 సినిమాల తరువాత అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
ఇప్పటికే ఈ సినిమాలో అల్లు అర్జున్ లుక్ విడుదల కాగా బన్నీ లుక్ కొత్తగా ఉందని ఈ సినిమా బన్నీకి కెరీర్ పరంగా ప్లస్ అవుతుందని అతని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కరోనా వల్ల వాయిదా పడుతుండగా వైరస్ ఉధృతి తగ్గడంతో ఈ నెల 8వ తేదీ నుంచి షూటింగ్ మళ్లీ ప్రారంభం కానుందని తెలుస్తోంది.భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాది సమ్మర్ లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.