పోస్టర్ పై సాయి పల్లవి పేరు.. ఇది సార్ ఆమె రేంజ్..!

రానా హీరోగా వేణు ఊడుగుల డైరక్షన్ లో వస్తున్న సినిమా విరాటపర్వం.సురేష్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమాలో రానా సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది.

 Sai Pallavi Name In Virata Parvam Release Poster ,sai Pallavi , Virata Parvam ,-TeluguStop.com

సినిమా టీజర్, ట్రైలర్ ఇప్పటికే సినిమాపై అంచనాలు పెంచగా ఫైనల్ గా సినిమాని జూలై 1న ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ఫిక్స్ అయ్యారు.ఈ క్రమంలో రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తూ వదిలిన పోస్టర్ పై హీరోతో పాటుగా హీరోయిన్ సాయి పల్లవి పేరుని కూడా పొందుపరిచారు.

మాములుగా అయితే సినిమా పోస్టర్స్ మీద కేవలం హీరోల పేర్లని మాత్రమే వేస్తారు.హీరోయిన్స్ పేర్లు వేయడం చాలా అంటే చాలా అరుదు.

అయితే తెలుగులో సాయి పల్లవి క్రేజ్ గురించి అందరికి తెలిసిందే.ఆమె సినిమా చేసింది అంటే అది సూపర్ హిట్ అన్నట్టే లెక్క.

టాలీవుడ్ లో ఏ హీరోయిన్ కి లేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఆమెకి ఉంది అంటే నమ్మాల్సిందే.అందుకే అభిమానుల అంచనాలకు తగినట్టుగానే సాయి పల్లవి సినిమాల ఎంపిక ఉంటుంది.

లవ్ స్టోరీ, శ్యాం సింగ రాయ్ ఇలా వరుస సినిమాలతో సూపర్ హిట్లతో దూసుకెళ్తున్న సాయి పల్లవి క్రేజ్ ని వాడుకునేందుకు పోస్టర్స్ లో కూడా ఆమె పేరుని పెట్టారు విరాటపర్వం టీం.మొత్తానికి హీరోయిన్ గా సాయి పల్లవి పోస్టర్ పై పేరు పెట్టేలా చేసుకోవడం లక్కీ అని చెప్పొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube