సాయి తేజ్ ‘SDT17’ అప్డేట్.. ఫస్ట్ హై అంటూ మేకర్స్ సాలిడ్ పోస్ట్!

మెగా ఫ్యామిలి నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వారిలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ( Sai Dharam Tej ) ఒకరు.

మెగా హీరోగా వచ్చిన మొదటి సినిమాతో మేనమామ చిరుకు తగ్గ మేనల్లుడుగా నిరూపించు కున్నాడు.

అలా మొదలైన ఇతడి కెరీర్ ఇప్పటికి బాగానే కొనసాగుతుంది.మధ్యలో కాస్త బ్రేక్ వచ్చినప్పటికీ మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చాడు.

సాయి తేజ్ లాంగ్ గ్యాప్ తీసుకుని విరూపాక్ష సినిమా( Virupakasha )తో వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.అంతేకాదు ఈ సినిమా 100 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి సాయి తేజ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

ఇక ఈ సినిమా తర్వాత సాయి తేజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి ఒక మల్టీస్టారర్ సినిమా బ్రో( Bro Movie ) లో నటించగా ఇది యావరేజ్ గా నిలిచింది.ఇక ఈ సినిమా తర్వాత మరో రెండు సినిమాలను లైన్లో పెట్టుకున్నాడు సాయి తేజ్.

Advertisement

బ్రో తర్వాత కొద్దీ విరామం ఇచ్చి ఇప్పుడు మళ్ళీ కొత్త సినిమాను సెట్స్ మీదకు తెచ్చాడు.సంపత్ నంది( Director Sampath Nandi ) దర్శకత్వంతో సాయి తేజ్ ఒక సినిమా చేస్తున్నాడు.

మరి ఈ ప్రాజెక్ట్ పవర్ ఫుల్ మాస్ ప్రాజెక్ట్ గా సంపత్ నంది తెరకెక్కిస్తున్నాడు.

మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుండి తాజాగా మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.సోషల్ మీడియా వేదికగా సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. SDT17 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి క్రేజీ ప్రీ లుక్ ను రివీల్ చేస్తూ రేపు ఉదయం అక్టోబర్ 15న 8 గంటల 55 నిముషాలకు పవర్ ఫుల్ ఫస్ట్ హై ను రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ తెలిపారు.

మరి ఆ ట్రీట్ ఏ లెవల్లో ఉంటుందో చూడాలి.

దంతాలపై పసుపు మరకలా.. ఈజీగా ఇలా వదిలించుకోండి..!
శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పిన బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్!

జైలు నేపథ్యంలో సాగే ఈ సినిమాను డీసెంట్ బడ్జెట్ తో తెరకెక్కింస్తుండగా సాయి తేజ్ పూర్తిగా మాస్ అండ్ రగ్డ్ లుక్ లో కనిపించనున్నారట.కాగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ ఈ సినిమాను నిర్మిస్తుండగా సంపత్ నంది సాయి తేజ్ కోసం పవర్ఫుల్ స్క్రిప్ట్ ను సిద్ధం చేసాడో చూడాలి.

Advertisement

తాజా వార్తలు