ఎక్కడ మొదలైందో అక్కడే ముగుస్తున్న సాహో  

ముగింపు దశకి చేరుకున్న సాహో షూటింగ్. .

Sahoo Shooting Going To End In Mumbai-going To End In Mumbai,rebel Star Prabhas,sahoo Shooting,shraddha Kapoor,tollywood

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం సాహో. సుజిత్ దర్శకత్వంలో సెల్యులాయిడ్ పైకి వెళ్తున్న ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంది. తాజాగ ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను ముంబైలోని చిత్రీకరిస్తున్నారు..

ఎక్కడ మొదలైందో అక్కడే ముగుస్తున్న సాహో-Sahoo Shooting Going To End In Mumbai

ముఖ్యంగా యాక్షన్‌ సీన్స్‌ తీస్తున్నారని తాజాగా బయటకి లీక్ అయిన ఫోటోల బట్టి తెలుస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాపై దర్శకుడు సుజిత్ ట్వీట్ చేసాడు. ఎక్కడ మొదలైందో అక్కడే ముగుస్తుంది.

ముంబైలో సాహో’ షూటింగ్‌ అని దర్శకుడు సుజిత్‌ పెట్టిన ట్వీట్ తో సినిమాకి గుమ్మడికాయ కొట్టేస్తున్నారు అనే విషయంపై అందరికి క్లారిటీ వచ్చేసింది. ఇదే చివరి ఈ షెడ్యూల్‌ అని తెలుస్తుంది. ప్రభాస్ తో పాటు హీరోయిన్ శ్రద్ధా కపూర్ కూడా ప్రస్తుత షూటింగ్ లో భాగం అయినట్లు తెలుస్తుంది.

ఇది పూర్తి కాగానే హైదరాబాద్ లో అన్నపూర్ణ స్టూడియోలో మొదలయ్యే జాన్ మూవీ షూటింగ్ లో ప్రభాస్ పాల్గొంటాడని తెలుస్తుంది.