సాహో నుంచి మరో అప్డేట్

బాహుబలి చిత్రం తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చిత్రం సాహో.అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం యొక్క లేటెస్ట్ అప్డేట్ ఒకటి వచ్చింది.

ఇటీవల ఈ చిత్రం ఆస్ట్రియా లోని ఇన్స్ బర్క్,టీరోల్ లో సాంగ్ చిత్రీకరించిన సంగతి సంగతి తెలిసిందే, ఈ నేపథ్యంలో ప్రభాస్ లొకేషన్ పిక్ ని షేర్ చేస్తూ ఇదొక గొప్ప అనుభూతి అని సోషల్ మీడియా ద్వారా తెలిపాడు.అయితే ఈ చిత్రంలో ఒక స్పెషల్ సాంగ్ లో శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఒక స్పెషల్ సాంగ్ లో ప్రభాస్ తో కాలు కదిపినట్లు సమాచారం.

జాక్వెలిన్ సాహో మేక‌ప్ టీంతో క‌లిసి దిగిన ఫోటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుండ‌గా, నెటిజ‌న్స్ సాహోలో జాక్వెలిన్ స్పెష‌ల్ సాంగ్ చేసిందంటూ క‌న్‌ఫాం చేస్తున్నారు.మ‌రి కొద్ది గంట‌ల‌లో ఈ వార్త పై చిత్ర యూనిట్ అనౌన్స్‌మెంట్ కూడా చేయనుంది.

దీనితో అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.సాహో చిత్రంలో బాలీవుడ్

Advertisement

న‌టి శ్ర‌ద్ధా క‌పూర్ క‌థానాయిక‌గా న‌టిస్తుండగా.300 కోట్ల బ‌డ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రం తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో కూడా విడుద‌ల‌వుతుంది.

యు.వి.క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై సినిమా నిర్మిత‌మ‌వుతుండగా,నీల్‌ నితిన్‌ ముఖేశ్‌ ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారు.ఎవ్లిన్‌ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్‌, మందిరా బేడీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.

త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

నేను ధనవంతురాలిని కాదు....నా దగ్గర సహాయం చేసేంత డబ్బు ఉంది : సాయి పల్లవి
Advertisement

తాజా వార్తలు