జిల్లాలో షీటీమ్స్ తో మహిళలకు, బాలికలకు భద్రత, భరోసా - ఎస్పీ అఖిల్ మహాజన్

రాజన్న సిరిసిల్ల జిల్లా: నవంబర్ నెలలో జిల్లాలో షీ టీమ్ సిబ్బంది మహిళలను, విద్యార్థినులను వేధిస్తున్న పోకిరీలను అదుపులోకి తీసుకొని వారి తల్లిదండ్రులు సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించి,వచ్చిన పిర్యాదులలో ఎఫ్ఐఆర్ లు 04, 02పెట్టి కేసులు నమోదు చేయడం జరిగింది.

అంతే కాకుండా షీ టీం బృందం జిల్లాలో 86 అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.జిల్లాలో ఉన్న షీ టీమ్స్ బృందాలు ప్రభుత్వ కళాశాలలో,, ప్రభుత్వ పాఠశాలల్లో, తెలంగాణ మోడల్ స్కూళ్లలో, రెసిడెన్షియల్ స్కూల్ లలో కేజీబీవీ స్కూళ్లలో విద్యార్థిని విద్యార్థులకు ర్యాగింగ్/ ఇవిటీజింగ్/ పోక్సో/ షీ టీమ్స్/ యాంటీ హ్యుమెన్ ట్రాఫికింగ్ లపై నిత్యం అవగాహన కల్పిస్తున్నారు అని అన్నారు.

మహిళలు ,బాలికల రక్షణ గురించి రాష్ట్రంలో ప్రత్యేకంగా షీ టీమ్స్ ఏర్పాటు చేసి,మహిళలు,బాలబాలికలు, విద్యార్థిని విద్యార్థులకు రక్షణగా నిలుస్తూ సేవలు అందించడం జరుగుతుంది.మహిళలు బాలికలు విద్యార్థినిలు షీటీమ్స్ సేవలు వినియోగించుకోవాలని ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలు అందిస్తామని తెలిపారు.

ఎలాంటి వేధింపుల కైన గురయ్యే మహిళలు షీటీమ్ కు పిర్యాదు చేయదలచుకునే మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, మహిళల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని అంతే కాకుండా మహిళలు అత్యవసర పరిస్థితుల్లో డయల్-100 కు కాల్ చేసి తక్షణ పోలీస్ సహాయం పొందాలని సూచించారు.ఎవరైనా వేధించిన, రోడ్డుపై వెళ్లేటప్పుడు,పని చేసే ప్రదేశాల్లో అవహేలనగా మాట్లాడిన ఉద్దేశపూర్వకంగా వెంబడించిన వెంటనే 100, జిల్లా షీ టీమ్ నెంబర్ 8712656425 కు పిర్యాదు చేసినచో వారి మీద చట్టపరమైన చర్యాలు తీసుకోవడం జరుగుతుంది అని అన్నారు.

Advertisement

విద్యార్థినిలకు, మహిళలకు, కళాశాల విద్య చాలా ముఖ్యమైనదని ఎవరు కూడా మీ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోకుండా మంచిగా చదువుకోవాలని ప్రతి ఒక్కరి రక్షణ గురించి షీటీమ్స్ పని చేయడం జరుగుతుందని, మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే షీ టీమ్ వాట్సప్ నెంబర్ కు ఫోన్ చేసి తెలపాలని,మీకు తెలియకుండా షీ టీమ్ పోలీసులు విద్యాసంస్థల వద్ద,రద్దీ ప్రదేశాల్లో సివిల్ డ్రస్ లలో నిత్యం తిరుగుతూ నిఘా ఉంటుంది అని తెలిపారు.షీ టీమ్స్ సిబ్బంది ప్రతిరోజు పాఠశాలను ,కళాశాలను సందర్శించి విద్యార్థినీ విద్యార్థులకు బాలికలకు షీటీమ్ దాని యొక్క ప్రాముఖ్యత నిర్వహించే విధుల గురించి, మానవ అక్రమ రవాణా, ఫోక్సో చట్టాల గురించి, బాల్య వివాహాలు దాని యొక్క పరిణామాల గురించి,ఈవిటిజింగ్,గుడ్ టచ్, బ్యాడ్ టచ్ తదితర అంశాల గురించి, సోషల్ మీడియా దాని యొక్క పరిణామాల గురించి, సైబర్ క్రైమ్స్, డయల్ 100 ప్రాముఖ్యత, సమాజ రుక్మతల గురించి సమాజంలో జరుగుతున్న నేరాలు వాటి నుండి ఎలా రక్షణ పొందాలి అనే అంశాల గురించి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ డిఫెన్స్, మహిళల పిల్లల రక్షణకు ఉన్న చట్టాల గురించి, సోషల్ మీడియా వల్ల జరుగు నష్టాలు లాభాల గురించి అవగాహన కల్పించడం జరుగుతుంది.

సూర్య భయ్యా, నువ్వు సూపర్.. రహానే సెంచరీ కోసం ఇంత త్యాగమా..?
Advertisement

Latest Rajanna Sircilla News