ఈ గిఫ్ట్ లారా ఇచ్చాడు అంటున్న సచిన్..!

సోమవారం నాటికి భారతదేశ దిగ్గజ క్రికెట్ ఆటగాడు సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికి ఏడు సంవత్సరాలు పూర్తయ్యాయి.

ఈ సందర్భంగా సచిన్ టెండూల్కర్ తన క్రికెట్ కెరీర్ కు సంబంధించిన జ్ఞాపకాలను ట్విట్టర్ ఖాతా ద్వారా నెమరు వేసుకున్నాడు.

ఈ సందర్భంగా సచిన్ టెండూల్కర్ తాను క్రికెట్ కు వీడ్కోలు పలికిన సందర్భంగా వెస్టిండీస్ క్రికెట్ జట్టులో దిగ్గజ బ్యాట్స్మెన్ అయినా లారా అలాగే యూనివర్సల్ బాస్ గా పిలుచుకునే క్రిస్ గేల్ తనకు ఓ అందమైన గిఫ్ట్ ఇచ్చారని సచిన్ టెండూల్కర్ తెలియజేశారు.ఆ గిఫ్ట్ ఏమిటి అంటే డ్రమ్స్.

అవి తనకి చాలా ఇష్టమని ఆయన చెప్పుకొచ్చాడు.ఇక అసలు విషయంలోకి వెళితే.

సరిగ్గా ఏడు సంవత్సరాల క్రితం విండీస్ క్రికెట్ జట్టు, అలాగే తన స్నేహితులైన లారా, క్రిస్ గేల్ తనకు ఓ అందమైన డ్రమ్ ను బహుకరించారు అని అటువంటి అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చిన వారికి తాను ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటానని తెలుపుతూ వీడియో పోస్ట్ చేశారు.విండీస్ ఆటగాళ్లు తనపై చూపించిన ప్రేమ గౌరవానికి ధన్యవాదాలు అంటూ సచిన్ ఆయన పోస్ట్ చేసిన వీడియోకు వ్యాఖ్యలు జత చేశాడు.

Advertisement

అంతే కాదు లారా తో తనకున్న జ్ఞాపకాలను కూడా సచిన్ నెమరు వేసుకున్నాడు.తనకి ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ కు సచిన్ కృతజ్ఞతలు తెలియజేశాడు.

గిఫ్ట్ ఇవ్వడమే కాకుండా తన ఇంటికి వచ్చినప్పుడు కూడా లారా ఆ డ్రమ్స్ వాయించడం తనకి ఇంకా గుర్తుందని చెప్పుకొచ్చాడు.అది మరిచిపోలేని అద్భుతమైన సందర్భం అని తెలిపాడు.అయితే ఇప్పుడు తను కూడా అంతలా కాకపోయినా కాస్త ప్రయత్నిస్తానని అయితే ఆ స్థాయిలో శబ్దం రాకపోవచ్చునని తెలిపాడు.

ఈ వీడియో మీ అందరికి అంకితం చేస్తున్నట్లు వీడియోలో తెలిపాడు. నవంబర్ 16, 2013 న సచిన్ టెండూల్కర్ తన అంతర్జాతీయ క్రికెట్ కి వాంఖేడే స్టేడియంలో రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

సచిన్ టెండూల్కర్ తన చివరి టెస్ట్ మ్యాచ్ ను విండీస్ జట్టు తో ఆడాడు.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు