పుష్ప నుండి 'సామీ' సాంగ్ ప్రోమో.. ఊర మాస్.. తగ్గేదిలే..!

సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప సినిమా నుండి థర్డ్ సాంగ్ ప్రోమో వచ్చింది.ఇప్పటికే దాక్కో దాక్కో మేక, శ్రీవల్లి సాంగ్స్ తో సినిమాపై అంచనాలు పెంచగా ఇక లేటెస్ట్ గా సామి సామి అంటూ పుష్పా థర్డ్ సాంగ్ ప్రోమోతోనే సూపర్ అనిపించగా ఫుల్ సాంగ్ అక్టోబర్ 28 ఉదయం 11 గంటలకు రిలీజ్ చేస్తారని ఎనౌన్స్ చేశారు.

 Saami Song Promo Released From Allu Arjun Pushpa , Allu Arjun, Allu Arjun Pushpa-TeluguStop.com

దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన మ్యూజిక్.మౌనికా యాదవ్ పాడిన విధానం సామి సాంగ్ మీద అంచనాలు పెంచేసింది.

జస్ట్ ప్రోమోతోనే ఊర మాస్ అనిపించేసిన ఈ సాంగ్ థియేటర్ లో దుమ్ముదులిపేస్తుందని మాత్రం చెప్పొచ్చు.

పుష్ప సినిమా ప్రతి విషయంలో ఏమాత్రం తగ్గేది లేదు అన్నట్టుగా సుకుమార్, అల్లు అర్జున్ ల ప్లాన్ ఉన్నట్టు ఉంది.

ఆల్రెడీ విజువల్స్ తో సూపర్ అనిపించేస్తుండగా మ్యూజిక్ తో మిరకిల్స్ చేయాలని చూస్తున్నారు.తప్పకుండా దేవి మ్యూజిక్ పుష్పని నెక్స్ట్ లెవల్ తీసుకెళ్తుందని అర్ధమవుతుంది.దాక్కో దాక్కో మేక, శ్రీవల్లిలకు మించి సామి సామి సాంగ్ అదరగొట్టేస్తుందని చెప్పొచ్చు.ఈ సినిమాలో అల్లు అర్జున్ కి జోడీగా రష్మిక మందన్న నటిస్తుంది.

సినిమాను డిసెంబర్ 17న రిలీజ్ ఫిక్స్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube