మన దేశంలోని ప్రజలలో కోట్ల సంఖ్యలో రైతుబిడ్డలు ఉన్నారు.ఇప్పటికీ వ్యవసాయాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తూ ఎంతోమంది కుటుంబాలను పోషిస్తున్నారు.
వ్యవసాయంలో( Agriculture ) నష్టాలు వస్తున్నా వాతావరణ పరిస్థితుల వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నా, మార్కెట్ లో గిట్టుబాటు ధర లేకపోయినా నేటికీ గ్రామాల్లో లక్షల మంది వ్యవసాయానికి పరిమితమయ్యారు.అయితే అలాంటి రైతుల కోసం రేయింబవళ్లు కష్టపడుతున్న వ్యక్తులలో రైతుబిడ్డ రాజేందర్ రెడ్డి( Rythu Bidda Rajender Reddy ) ఒకరు.
టీవీ మీడియా, ప్రింట్ మీడియాలో పని చేసిన రాజేందర్ రెడ్డి ఆకలి తీర్చే రైతులకు తోటి రైతుల అనుభవాలను, కష్ట నష్టాలను వివరించడంతో పాటు కొత్త టెక్నాలజీలను పరిచయం చేయడమే తన లక్ష్యమని చెబుతున్నారు.రాజేందర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ తెలుగు రైతుబడికి( Telugu RythuBadi ) 1.28 మిలియన్ల సబ్ స్క్రైబర్లు ఉన్నారు.యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆదాయం కంటే ఆత్మసంతృప్తి ఎక్కువగా లభిస్తుందని ఆయన చెబుతున్నారు.

తన యూట్యూబ్ ఛానల్ కోసం ఎవరి సహాయం తీసుకోకుండానే రాజేందర్ రెడ్డి సక్సెస్ సాధిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు.రైతులకు ఉపయోగపడేలా రాజేందర్ రెడ్డి చేస్తున్న వీడియోలకు ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.మూడేళ్ల క్రితం రాజేందర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ ను మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదిగారు.ఎన్నో సవాళ్లు ఎదురైనా ఆ సవాళ్లను అధిగమిస్తూ రాజేందర్ రెడ్డి సత్తా చాటుతున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాలలో రాజేందర్ రెడ్డి పర్యటిస్తూ రైతులకు( Farmers ) అమూల్యమైన సలహాలు ఇస్తున్నారు.రైతుల కోసం పని చేయడం వల్ల మరింత ఉత్సాహంగా ముందుకు వెళ్తున్నానని ఆయన చెప్పుకొచ్చారు.రైతుల కోసం విజ్ఞానాన్ని పంచుతున్న రాజేందర్ రెడ్డి నిజమైన రైతుబిడ్డ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.నాకంటూ ఒక గుర్తింపు ఉండాలనే ఆలోచనతో రైతుబిడ్డ దిశగా అడుగులు పడ్డాయని రాజేందర్ రెడ్డి అన్నారు.
రాజేందర్ రెడ్డి సక్సెస్ స్టోరీ( Rajender Reddy Success Story ) గురించి తెలిసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.








