తన లవ్ స్టోరీ చెప్పేసిన కార్తికేయ.. తొలిసారి లోహితను అక్కడ కలిశానంటూ..?

టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన కార్తికేయ తాజాగా రహస్యంగా నిశ్చితార్థం చేసుకుని వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.

ఆర్ ఎక్స్ 100 సినిమాతో విజయం అందుకున్న కార్తికేయ ఆ సినిమా తర్వాత పలు సినిమాల్లో హీరోగా నటించినా ఆర్ ఎక్స్ 100 స్థాయి సక్సెస్ మాత్రం రాలేదు.

ఈ ఏడాది చావుకబురు చల్లగా సినిమాతో కార్తికేయకు చేదు ఫలితం ఎదురైంది.తాజాగా కార్తికేయ తన లవ్ స్టోరీ గురించి చెబుతూ లోహితను 2010 సంవత్సరంలో నిట్ వరంగల్ లో కలిశానని అన్నారు.

ఆరోజు నుంచి ఈరోజు వరకు తనతో ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయని కార్తికేయ చెప్పుకొచ్చారు.రాబోయే రోజుల్లో కూడా తన జీవితంలో అలాంటి మధుర క్షణాలు ఉంటాయని భావిస్తున్నానని కార్తికేయ పేర్కొన్నారు.

లోహిత తన ప్రాణ స్నేహితురాలు అని ఆమెతో తనకు నిశ్చితార్థం జరిగిందని లోహిత తనకు జీవిత భాగస్వామి కాబోతున్నారని కార్తికేయ కామెంట్లు చేశారు.త్వరలో లోహితతో తన వివాహం జరగబోతుందని కార్తికేయ వెల్లడించారు.

Advertisement

కార్తికేయ పది సంవత్సరాల క్రితం దిగిన ఫోటోతో పాటు ప్రస్తుతం దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయగా ఆ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.టాలీవుడ్ సినీ ప్రముఖులతో పాటు కార్తికేయ అభిమానులు కార్తికేయకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు.లోహిత కార్తికేయకు ఫ్రెండ్ కావడంతో పాటు రిలేటివ్ అని సమాచారం.

కార్తికేయ ప్రస్తుతం రాజా విక్రమార్క అనే సినిమాలో హీరోగా నటిస్తుండగా అజిత్ హీరోగా తెరకెక్కుతున్న వాలిమై సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నాడు.కార్తికేయ నానీ గ్యాంగ్ లీడర్ సినిమాలో విలన్ పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.భవిష్యత్తు సినిమాలతో కార్తికేయ విజయాలను సొంతం చేసుకోవాలని ఆయన అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు