ఉక్రెయిన్ రాజధానిపై రష్యా భీకర దాడులు

ఉక్రెయిన్, రష్యా మధ్య గత కొన్ని నెలలుగా యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో తాజాగా ఉక్రెయిన్ రాజధాని కీవ్ లక్ష్యంగా మరోసారి విరుచుకుపడుతోంది.

కీవ్ పై వందల సంఖ్యలో మిస్సైళ్లను రష్యా ప్రయోగిస్తోంది.ఈ దాాడుల్లో రాజధానిలోని మూడు అపార్ట్ మెంట్లు ధ్వంసం అయినట్లు తెలుస్తోంది.

కాగా ఈ దాడుల్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కార్యాలయం ధ్వంసం అయినట్లు ప్రచారం జరుగుతోంది.క్రిమియా బ్రిడ్జి ధ్వంసంతో పుతిన్ ఆగ్రహంతో రగిలిపోతున్నట్లు తెలుస్తోంది.

కొత్త వార్ జనరల్ బాధ్యతలు తీసుకున్న గంటల్లోనే కీవ్ పై భీకర దాడులు చేస్తోంది.దాదాపు మూడున్నర నెలల తర్వాత కీవ్ లక్ష్యంగా రష్యా దాడులకు పాల్పడుతోంది.

Advertisement
అమెరికా అధ్యక్ష ఎన్నికలు : కమల, ట్రంప్‌లలో గెలుపెవరిది.. యూఎస్ నోస్ట్రాడమస్ ఏం చెప్పారంటే?

తాజా వార్తలు