ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఎప్పటినుండో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.టీడీపీ అధినేత చంద్రబాబు సైతం పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన నాయకులతో సమావేశాలలో.
ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది.ఇటువంటి తరుణంలో తాజాగా వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ ముందస్తు ఎన్నికల ప్రచారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.“ముందస్తు ఎన్నిక అనేది ఊహాజనితమే.చేతకాకపోతే ముందస్తుకు వెళ్లాలి.
మాది దమ్మున్న ప్రభుత్వం.అమరావతి దోపిడీ అన్నప్పుడు పవన్ కు అవగాహన లేదా.? విశాఖ భూములపై త్వరలో సిట్ నివేదిక విడుదలవుతుంది అని బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా విశాఖలో రాజధాని వస్తే వచ్చే నష్టం ఏంటో తెలపాలని …మూడు రాజధానులు వ్యతిరేకించే పార్టీలను బొత్స ప్రశ్నించారు.
వైయస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న టైంలో విశాఖ అభివృద్ధి చెందిందని అన్నారు.చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న టైములో విశాఖలో అభివృద్ధి జరగలేదని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.