బిలియనీర్లకు శాపంగా రష్యా-ఉక్రెయిన్ వార్.. లక్షల కోట్ల సంపద ఆవిరి

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై ఒక సంవత్సరం పూర్తైంది.కానీ రెండు దేశాలలో ఒకటి ఆధిపత్యం, మరొకటి ఆత్మ గౌరవం కోసం పోరాడుతున్నాయి.

 Russia Ukraine War Is A Curse For Billionaires ,billionaires,russia, Urikrane, W-TeluguStop.com

ఈ యుద్ధంలో ఎవరూ గెలవలేదు.ఎవరూ ఓడిపోలేదు.

వేలాది మంది సైనికులు, ప్రజలు రెండు వైపుల నుండి ప్రాణాలు కోల్పోయారు.ముఖ్యంగా ఉక్రెయిన్ నగరాలు శిధిలాలుగా మారాయి.

యుద్ధం నుంచి రష్యా వెనక్కి వెళ్ళడానికి సిద్ధంగా లేదు.రష్యాకు కూడా యుద్ధం వల్ల తీవ్ర ఆర్థిక, సైనిక నష్టం వాటిల్లింది.

యుద్ధం ఇరు దేశాలను మాత్రమే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపింది.ముఖ్యంగా ప్రపంచంలోని ఎంతో మంది బిలియనీర్ల సంపద ఈ యుద్ధం వల్ల ఆవిరి అయింది.

ఆ వివరాలు తెలుసుకుందాం.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనయ్యాయి.బిలియనీర్ల సంపద 10 శాతానికి పైగా హరించుకుపోయింది. నైట్ ఫ్రాంక్ నివేదికలో ఆ మొత్తం 10.1 ట్రిలియన్ డాలర్లు అని తెలుస్తోంది.భారత కరెన్సీలో ఆ మొత్తం రూ.808 లక్షల కోట్లు.నమ్మశక్యం కాకపోయినా ఇది నిజం.

ఈ యుద్ధం వల్ల ప్రపంచ దేశాలలో ఆహార, ఇంధన సంక్షోభం తలెత్తింది.ముఖ్యంగా యూరప్‌లో ఇంధన కొరత ఏర్పడింది.

ఫలితంగా అన్ని వస్తువుల ధరలు పెరిగి, ద్రవ్యోల్బణం ఏర్పడింది.ఇదే కాకుండా రాబోయే రెండు ఆర్థిక సంవత్సరాల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందకొడిగా ఉంటుంది.గత ఆర్థిక సంవత్సరంలో, ప్రపంచ జిడిపి 2.2%తో స్వల్ప పెరుగుదలతో 3.1%గా అంచనా వేయబడింది.2024 లో ఇది 2.7%వరకు ఉంటుంది.2023 లో, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం ప్రధాన ఆసియా మార్కెట్‌పై ఆధారపడి ఉంటుంది.ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రపంచంలో ద్రవ్యోల్బణం 9% కంటే ఎక్కువ ఉండవచ్చు.ఇది 2023 చివరి నాటికి 6.6% మరియు 2024 లో 5.1% తగ్గుతుందని అంచనా.యుద్ధం వల్ల ఇన్ని దుష్పరిణామాలు తలెత్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube