జలాంతర్గామి లో ఘోర అగ్నిప్రమాదం, 14 మంది మృతి

రష్యా లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.అయితే ఈ ప్రమాదం జలాంతర్గామి లో చోటుచేసుకున్నట్లు తెలుస్తుంది.

సముద్రగర్భంలో ఉన్న జలాంతర్గామి లో ఈ ప్రమాద ఘటన సంభవించినట్లు అక్కడి అధికారులు తెలిపారు.ప్రాదేశిక జలాల్లోని సముద్ర గర్భంలోని జలాంతర్గామి లో పరిశోధన జరుగుతున్న సమయంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది అని, ఈ ఘటనలో 14 మంది నౌకాదళ సిబ్బంది మరణించినట్లు రక్షణ శాఖ అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జలాంతర్గామి సముద్ర గర్భంలో పరిశోధనలు చేస్తున్న సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది అని, దీనితో విష వాయువులు వెలువడ్డాయని అధికారులు తెలిపారు.

అయితే ఈ విష వాయువులు పీల్చడం తో 14 మంది నౌకా దళ సిబ్బంది మృతి చెందినట్లు తెలిపారు.అయితే ప్రస్తుతం ఈ జలాంతర్గామి ని ఆర్కిటిక్ సముద్ర తీరంలోని తమ సైనిక స్థావరానికి తరలించామని అధికారులు తెలిపారు.అయితే ఈ ఘటన ఎలా చోటుచేసుకుంది అన్న వివరాలపై అధికారులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తుంది.

Advertisement

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు