బలగం చూసి ఆ నటికి దేవరలో ఛాన్స్ ఇచ్చిన యంగ్ టైగర్.. గ్రేట్ హీరో అంటూ?

జబర్దస్త్ కమెడియన్ వేణు ( Jabardast comedian Venu )దర్శకుడిగా తెరకెక్కించిన సినిమా బలగం ( balagam ).ఈ సినిమాతోనే దర్శకుడిగా మారాడు వేణు.

ఈ సినిమా కంటే ముందు చాలా సినిమాలలో కమెడియన్స్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే.ఈ సినిమాతో డైరెక్టర్ గా మారి తనంటే ఏంటో నిరూపించుకున్నాడు వేణు.

మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నారు.ఇక ఈ సినిమాలో ప్రతి ఒక్క పాత్ర మన ఇంట్లోనే ఒకరిగా కనిపిస్తుంది.

అంత సహజంగా ఈ సినిమాను తీర్చిదిద్దారు.ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్క పేక్షకుడు అలాగే సెలబ్రిటీలు వేణు ని ప్రశంసించకుండా ఉండలేకపోయారు.

Advertisement

ఇకపోతే ఈ సినిమాలో లక్ష్మీ పాత్రలో నటించిన నటి రూపలక్ష్మి ( Actress Rupalakshmi )గురించి మనందరికీ తెలిసిందే.ఈమె ఈ సినిమాతో పాటు పలు తెలుగు సినిమాలలో కూడా నటించింది మెప్పించింది.బలగం సినిమాలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది.

దీంతో బలగం సినిమా తర్వాత ఈమెకు సినిమాలలో అవకాశాలు వరుసగా వస్తున్నాయి.ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రూపలక్ష్మీ మాట్లాడుతూ తనకు సినిమా అవకాశాలు రావడం పై స్పందించింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.నాకు ముందున్న సీనియర్ ఆర్టిస్టుల నుంచి నేను క్రమశిక్షణను నేర్చుకున్నాను.

అలాగే నేను ఒప్పుకున్న పాత్రకి న్యాయం చేయడం కోసమే చివరివరకూ ప్రయత్నిస్తాను.అలాగే ఎన్టీఆర్ చేస్తున్న దేవర సినిమాలో కూడా ఒక ముఖ్యమైన పాత్రను చేశాను.

ఆ దేశంలో మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూటింగ్.. హీరోయిన్ ను మార్చాలంటూ?
రాష్ట్రపతి ముర్ము విందుకు వచ్చిన ఇండోనేషియన్లు ఏం చేశారో చూడండి.. వీడియో వైరల్..

ఆ పాత్రకి నన్ను తీసుకోమని ఎన్టీఆర్ ( NTR )చెప్పారట.ఆ విషయం నాకు ఎంతో ఆనందాన్నీ, ఆశ్చర్యాన్ని కలిగించింది అని రూప లక్ష్మీ చెప్పుకొచ్చింది.ఆ తరువాత నేను ఎన్టీఆర్ గారిని కలిశాను.

Advertisement

అప్పుడు ఆయన బలగ సినిమా గురించి ప్రస్తావించారు.ఆ సినిమాలో చాలా బాగా చేశారంటూ నన్ను ప్రశంసించినప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది.

ఈ రోజున నేను ఈ స్థాయి వరకూ వెళ్లడానికి కారణం బలగం సినిమానే.బలగం సినిమా నాకు భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ అని రూప లక్ష్మీ తెలిపింది.

ఈ సందర్భంగా ఆమె చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

తాజా వార్తలు