సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు తమ వ్యక్తిగత విషయంలో తమకు నచ్చినట్లుగా ప్రవర్తిస్తుంటారు.ముఖ్యంగా ప్రేమ, పెళ్లి, విడాకుల విషయంలో బాగా హైలెట్ గా నిలుస్తారు.
తమకు నచ్చిన వ్యక్తిని ప్రేమిస్తారు లేకుంటే వదిలేస్తారు.పెళ్లి జీవితంలో కూడా ఓ వ్యక్తిని పెళ్లి చేసుకొని పిల్లలను కన్నాక కూడా విడాకులు తీసుకుంటారు.
ఇవన్నీ సినీ ఇండస్ట్రీలో కామన్ అనే చెప్పాలి.గతంలో ఓ హీరోయిన్ కూడా తాను పెళ్లి చేసుకున్న తర్వాత రీ ఎంట్రీ తో సినిమాలో అడుగు పెట్టింది.
అదే సమయంలో తనకు మరో వ్యక్తితో పరిచయం పెరగటంతో తన ఇమేజ్ మొత్తం డ్యామేజ్ చేసుకుందని బాగా ప్రచారాలు వచ్చాయి.అంతేకాకుండా తనకు అంతకు ముందు వచ్చిన గౌరవం కూడా కోల్పోయిందని తెలిసింది.
ఆ హీరోయిన్ ఎవరంటే.
ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ ఆర్తి అగర్వాల్.తన నటనతో ఎంతో మంచి పేరు సంపాదించుకుంది.తన అందంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.
ఇక ఈమె అతి తక్కువ సమయంలో మంచి హోదాను సంపాదించుకున్నాక ఆ హోదాను అతి తక్కువ సమయంలో కోల్పోయింది.తొలిసారిగా నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది.
ఈ సినిమాతో మంచి హిట్ ని సంపాదించుకుంది.ఆ తర్వాత నువ్వు లేక నేను లేను, అల్లరి రాముడు, ఇంద్ర, వసంతం, అడవి రాముడు, సోగ్గాడు, అందాల రాముడు వంటి సినిమాలలో స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
పలు సినిమాలలో స్పెషల్ సాంగ్ లో కూడా నటించింది.హిందీలో కూడా ఒక సినిమాలో నటించింది.
ఇక ఈమె వసంతం సినిమా తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చింది.కారణం తాను 2007లో ఉజ్వల్ నికమ్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది.ఆ సమయంలో తన సినిమాలకు దూరంగా ఉండగా తన భర్తతో అమెరికాలో సెటిల్ అయింది.
అలా వారి మధ్య కొంతకాలం తర్వాత మనస్పర్ధలు రావడంతో విడిపోయారు.ఆమె అమెరికాలోనే ఉండగా ఆమెకు సినిమాలపై మళ్లీ ఆసక్తి కలగటంతో రీ ఎంట్రీ తో అవకాశాలు అందుకుంది.
కానీ పెళ్లి తర్వాత తను నటించిన ఏ సినిమా కూడా తనకు అంత సక్సెస్ ఇవ్వలేదు.రీ ఎంట్రీ ఇచ్చిన సమయంలో తను పర్సనల్ అసిస్టెంట్ గా ఉన్న ఓ వ్యక్తితో కలిసి తిరుగుతుందని జోరుగా ప్రచారాలు జరిగాయి.అతడితో కలిసి షాపింగ్ లు, పబ్ లలో తిరుగుతుందని దాంతో ఇండస్ట్రీలో కూడా ఈమె ప్రవర్తన మారిందని తెలిసింది.
పైగా తన నటన లో ఎటువంటి డెడికేషన్ లేదని దర్శకులు కూడా అన్నారట.ఈమె అమెరికాలో తన భర్తను వదిలేసి మళ్లీ అతడితో అలా తిరుగుతుంది ఏంటి అని ఎంతోమంది విమర్శలు చేసినా కూడా అసలు పట్టించుకోలేదట.
గతంలో ఈమెకు తరుణ్ తో సంబంధం ఉన్నట్లు బాగా పుకార్లు రావడంతో ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసుకుంది.ఇక ఈమె 2017 లో హార్ట్ ఎటాక్ తో మరణించిన సంగతి అందరికీ తెలిసిందే.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy