రూలర్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. డిజాస్టర్ ఖాయం

నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం ‘రూలర్’ ఇటీవల రిలీజ్ అయ్యి డిజాస్టర్ టాక్‌ను సొంతం చేసుకుంది.

తమిళ డైరెక్టర్ కెఎస్ రవికుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు తొలిరోజే నెగెటివ్ టాక్ రావడంతో ఈ సినిమాను చూసేందుకు జనం ఆసక్తి చూపించలేదు.

ఇక జైసింహా వంటి యావరేజ్ సినిమాను అందించిన కెఎస్ రవికుమార్ మరోసారి రొటీన్ కథతో బాలయ్యను ప్రేక్షకుల ముందుకు వదలడంతో నందమూరి ఫ్యాన్స్ కూడా ఈ సినిమాను రిజెక్ట్ చేశారు.దీంతో ఈ సినిమా ఫస్ట్ వీక్ ముగిసే సరికి ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.7.24 కోట్ల మేర కలెక్షన్లు మాత్రమే సాధించింది.అటు ప్రతిరోజూ పండగే సినిమా కూడా అదే రోజు రిలీజ్ అయ్యి మంచి టాక్ సొంతం చేసుకోవడంతో, రూలర్ సినిమాను చూసేందుకు థియేటర్లకు జనం అనాసక్తి చూపించారు.

ఇక ఏరియాల వారీగా ఈ సినిమా వరల్డ్‌వైడ్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.నైజాం - 1.30 కోట్లు సీడెడ్ - 1.85 కోట్లు నెల్లూరు - 0.48 కోట్లు కృష్ణా - 0.40 కోట్లు గుంటూరు - 1.33 కోట్లు వైజాగ్ - 0.48 కోట్లు ఈస్ట్ - 0.39 కోట్లు వెస్ట్ - 0.40 కోట్లు టోటల్ ఏపీ+తెలంగాణ - 6.49 కోట్లు రెస్టాఫ్ ఇండియా - 0.55 కోట్లు ఓవర్సీస్ - 0.20 కోట్లు టోటల్ వరల్డ్‌వైడ్ కలెక్షన్స్ - 7.24 కోట్లు.

సూర్య తో మల్టీ స్టారర్ సినిమా చేయనున్న మరో స్టార్ హీరో...
Advertisement

తాజా వార్తలు