తెలంగాణలో ఆర్టీసీ విలీనాన్ని రాజకీయం చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కోరిన క్లారిటీ అంశాలను సీఎస్ ద్వారా ఇస్తే మంచిదని పేర్కొన్నారు.
గవర్నర్ సీఎస్ ను పిలిచి వివరణ కోరవచ్చని తెలిపారు.ఆర్టీసీ కార్మిక సంఘాలతో గవర్నర్ మాట్లాడటం మంచిదే కానీ సీఎస్ తో గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్ ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు.
ఈ క్రమంలో ప్రభుత్వం సీఎస్ ను పంపించి గవర్నర్ అనుమానాలను నివృత్తి చేయాలని పేర్కొన్నారు.అవసరం అయితే అసెంబ్లీ సమావేశాలను పొడిగించి ఆర్టీసీ బిల్లు ఆమోదించాలని వెల్లడించారు.
అదేవిధంగా సెప్టెంబర్ 1న ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.