టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్( Prabhas ) తన ప్రతిభను మాటల కంటే చేతల్లో చూపడానికి ఇష్టపడతారు.తన సినిమాల వల్ల నిర్మాతలకు, బయ్యర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు వస్తే తన వంతు సహాయం చేసే విషయంలో ప్రభాస్ ముందువరసలో ఉంటారు.
సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలతో ప్రభాస్ కు ఎదురుదెబ్బలు తగలగా సలార్,( Salaar ) ప్రాజెక్ట్ కే( Project K ) మాత్రం ఫ్యాన్స్ కోరుకున్న అంశాలతో తెరకెక్కుతోందని ప్రభాస్ ఫీలవుతున్నారు.
సాధారణంగా స్టార్ హీరోలు నటించిన ఒకటి లేదా రెండు సినిమాలు ఫ్లాప్ అయితే ఆ హీరోల మార్కెట్ తగ్గుతుంది.
అయితే గత సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయినా ప్రభాస్ మార్కెట్ అణువంతైనా తగ్గలేదంటే ప్రభాస్ క్రేజ్ కు ఇంతకు మించిన ప్రత్యేక సాక్ష్యాలు అవసరం లేదు.ఈ నెలలోనే సలార్ ట్రైలర్ రిలీజ్ కానుందని మేకర్స్ నుంచి అప్ డేట్ రాగా సలార్ ఫస్ట్ సింగిల్ కు సంబంధించిన క్లారిటీ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరోవైపు ప్రభాస్ కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు.మనస్తత్వం దృష్ట్యా సెన్సిటివ్ అయిన ప్రభాస్ తన కుటుంబానికి ఏ చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేరు.కృష్ణంరాజు( Krishnam Raju ) మరణం తర్వాత ప్రభాస్ తన కుటుంబానికి అండగా నిలిచారు.ప్రభాస్ తండ్రి పేరు ఉప్పలపాటి సూర్య నారాయణ రాజు( Uppalapati Suryanarayana Raju ) కాగా ప్రభాస్ స్టార్ హీరో కావడంలో ఈయన పాత్ర ఎంతో ఉంది.
సూర్య నారాయణ రాజు మరణించడానికి కొన్ని నెలల ముందు ప్రభాస్ తన తండ్రికి ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చారు.

ప్రభాస్ తన తండ్రికి ఇచ్చిన ఖరీదైన గిఫ్ట్ ఈ కారు ( Car ) మాత్రమేనట.ఒకవేళ ఈ కారు ఇవ్వకుండా ఉండి ఉంటే మాత్రం తాను ఎంత పెద్ద స్టార్ హీరో అయినా తండ్రి విషయంలో తప్పు చేశాననే అపరాధ భావన ఉండేదని ప్రభాస్ ఫీలయ్యారట.ప్రభాస్ ఈశ్వర్ మూవీలో నటించిన సమయంలోనే తన కొడుకు భాషతో సంబంధం లేకుండా సత్తా చాటుతాడని, నంబర్ వన్ స్థాయికి ఎదుగుతాడని సూర్య నారాయణ రాజు భావించగా ప్రభాస్ విషయంలో ఆయన నమ్మకమే నిజమైంది.







