రూ. 1600 కోట్ల ఇంద్రభవనంపై కన్నేసిన భారతీయుడు?

విలాసవంతమైన భవనాలకు పెట్టింది పేరు దుబాయ్‌( Dubai ).అక్కడ రియల్ ఎస్టేట్‌కున్న డిమాండ్‌ గురించి మీరు వినే వుంటారు.

 Rs. 1600 Crore An Indian Eyeing The Indrabhavanam, Nri News, Indian, 1600 Crore-TeluguStop.com

ఈ మహానగరంలో అత్యంత ఖరీదైన ఇల్లు అమ్మకానికి వుంది.దానిపేరు “మార్బుల్‌ ప్యాలెస్.”( Marble Palace ) ఇక దీని ధర వింటే షాక్ అవుతారు.మార్కెట్‌లో దీని ధర రూ.1,600 కోట్లు (750 మిలియన్ దిర్హామ్‌ల) పలుకుతోంది.ఇక ఈ ఇంద్రభవనంపై మోజుపడుతున్నవారిలో ఒక భారతీయుడు ఉండటం చెప్పుకోదగ్గ విషయం.

మార్బుల్ ప్యాలెస్ గా పిలుస్తున్న ఈ భవనాన్ని అతి ఖరీదైన ఇటాలియన్ మార్బుల్ స్టోన్‌తో నిర్మించడం వలన దానికి ఆ పేరు వచ్చింది.లుస్హబిటాట్ సోత్ బేస్ ఇంటర్నేషనల్ రియాల్టీ విక్రయిస్తున్న ఈ భవన నిర్మానికే దాదాపు 12 సంవత్సరాలు పట్టిందని భోగట్టా.

Telugu Crore, Dubai, Indian, Latest, Marble Palace, Nri, Estate-Telugu NRI

ఇక ఈ భవనం విశేషాలు చూస్తే, 60వేల చదరపు అడుగుల ఇంటిలో 5 బెడ్‌రూమ్‌లు కలవు.ఇందులో మాస్టర్ బెడ్‌రూమ్ ఒక్కటే 4,000 చదరపు అడుగులు, అంటే ఒక పెద్ద భవనం మించి ఉంటుంది.అలాగే 15-కార్ల గ్యారేజ్, ఇండోర్ అలాగే అవుట్‌డోర్ పూల్స్, 19 రెస్ట్‌రూమ్‌లు, 2 రూఫ్‌లు, 80,000 లీటర్ (21,000 గాలన్లు) కోరల్ రీఫ్ అక్వేరియం( Coral Reef Aquarium ), ఎలక్ట్రికల్ సబ్‌స్టేషన్ ఎమర్జెన్సీ రూమ్‌లు ఇంకా ఇతర ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ఇది 70 వేల చదరపు అడుగుల స్థలంలో గోల్ఫ్ కోర్స్‌కి ఎదురుగా ఉన్న గేటెడ్ కమ్యూనిటీలో ఉంది.ఈ ఆస్తిని ఎవరైనా కొనుక్కోవచ్చు లేదంటే అద్దెకు తీసుకోవచ్చు, లేదా టెన్నిస్ లేదా పాడెల్ బాల్ కోర్ట్ కోసం ఉపయోగించవచ్చు అని దాని బ్రోకర్ కునాల్ సింగ్( Kunal Singh ) చెబుతున్నారు.

Telugu Crore, Dubai, Indian, Latest, Marble Palace, Nri, Estate-Telugu NRI

ఈయన చెబుతున్న వివరాల ప్రకారం, ఈ ప్రపంచంలో దీనిని కేవలం 5 నుండి 10 మంది సంపన్నులు మాత్రమే దీనిని కొనుగోలు చేయగలరు అని అభిప్రాయ పడ్డారు.అంతేకాకుండా గత 3 వారాల్లో కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఇంటిని చూడడం జరిగిందట.ఇందులో రష్యాకు చెందిన కొనుగోలు ప్రతినిధి ఒకరు కాగా, రెండో కస్టమర్ ఎమిరేట్స్ హిల్స్‌లో ఇప్పటికే 3 నివాసాలను కలిగి ఉన్న భారతీయుడు కావడం విశేషం.

ఇక్కడ ట్విస్ట్ ఏమంటే, ఆయన భార్య ఇంకొంచెం మెరుగైన దాని కోసం ఎదురు చూస్తోందని… అందుకే నిర్ణయం తీసుకోలేదని సింగ్ తాజాగా ఓ ప్రకటనలో పేర్కొన్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube