2022 సంక్రాంతికి ఎప్పుడు లేనిది మూడు నాలుగు సినిమాలు పెద్దవి విడుదలకు సిద్దం అవుతున్నాయి అంటూ ఆరు నెలలుగా వార్తలు వస్తున్నాయి.సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట ఎప్పుడో 2022 సంక్రాంతికి అంటూ ఫిక్స్ అయ్యింది.
ఇక రాధే శ్యామ్ ఇటీవలే సంక్రాంతికి విడుదల కాబోతున్నట్లుగా ప్రకటించారు.భీమ్లా నాయక్ సినిమాను కూడా ఈ సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.
ఇంకా మూడు నాలుగు మీడియం బడ్జెట్ సినిమా లు కూడా విడుదల అవుతాయని భావించారు.ఇన్ని సినిమా లకు స్కోప్ ఉందా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్న సమయంలో ఇండియాస్ బిగ్గెస్ట్ మరియు బ్లాక్ బస్టర్ మూవీ ఆర్ ఆర్ ఆర్ కూడా సంక్రాంతి బరిలో నిలిచేందుకు సిద్దం అయ్యింది.
సంక్రాంతి ముందు వారంలో ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు.ఇప్పటికే సంక్రాంతికి ఆ సినిమాలు ఉన్న కారణంగా వారిని ఇబ్బంది పెట్టడం ఎందుకు అనుకున్నారో లేదా మరేంటో కాని సినిమాను విడుదల చేయడం కోసం సంక్రాంతి ముందు వారం ను ఖరారు చేయడం జరిగింది.
ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదలకు ముందు వారం మరియు విడుదల తర్వాత రెండు వారాలు ఏ సినిమాలు రాకుంటేనే బెటర్.

ఎందుకంటే జక్కన్న సినిమా ఏ రేంజ్ లో సందడి చేస్తుందో అర్థం చేసుకోవచ్చు.అందుకే సంక్రాంతికి విడుదల అవ్వాలనుకున్న సర్కారు వారి పాట మరియు రాధే శ్యామ్ సినిమా లు విడుదల వాయిదా పడ్డట్లుగా వార్తలు వస్తున్నాయి.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఆర్ ఆర్ ఆర్ సినిమా కోసం ఆ రెండు సినిమా లు సైడ్ అవ్వగా భీమ్లా నాయక్ మాత్రం సంక్రాంతికే విడుదల అవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది.