ఆర్ఆర్ఆర్ మూవీని మిస్ చేసుకున్న బాలీవుడ్, హాలీవుడ్ స్టార్ హీరోయిన్లు వీళ్లే?

రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఐదు రోజుల్లోనే ఈ సినిమా బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలతో పాటు ఓవర్సీస్ లో రికార్డు స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటోంది.

రామరాజు, భీమ్ పాత్రలలో తారక్, చరణ్ తమ యాక్టింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.చరణ్ కు జోడీగా అలియా భట్ నటించగా తారక్ కు జోడీగా ఈ సినిమాలో ఒలీవియా మోరిస్ నటించారు.

అయితే ఆర్ఆర్ఆర్ మూవీలో సీత పాత్ర కొరకు మేకర్స్ మొదట సాహో సినిమాలో నటించి మెప్పించిన శ్రద్ధా కపూర్ ను సంప్రదించారు.అయితే వేర్వేరు కారణాల వల్ల శ్రద్ధా కపూర్ ఈ సినిమాలో నటించడానికి ఓకే చెప్పలేదు.అప్పటికే వేరే సినిమాలకు డేట్స్ కేటాయించడం వల్ల శ్రద్ధా కపూర్ ఈ సినిమాను వదులుకున్నారని ప్రచారం జరిగింది.

ఆ తర్వాత మేకర్స్ ఈ సినిమా కోసం పరిణీతి చోప్రాను సంప్రదించారు.

Advertisement

అయితే సీత పాత్రకు డేట్స్ కేటాయించే విషయంలో ఇబ్బందులు ఎదురు కావడంతో పరిణీతి చోప్రా కూడా ఆ ఆఫర్ ను వదులుకున్నారని బోగట్టా.ఇక ఎన్టీఆర్ కు జోడీగా ఉన్న జెన్నీఫర్ రోల్ కోసం మేకర్స్ మొదట అమీ జాక్సన్ ను సంప్రదించారు.అయితే అమీ జాక్సన్ గర్భవతి కావడం వల్ల ఆ ఆఫర్ ను వదులుకున్నారు.

ఆ తర్వాత ఈ పాత్ర కొరకు హాలీవుడ్ నటి డైసీ ఎడ్గార్ జోన్స్‌ ను తీసుకున్నారు.

అయితే కొన్ని కారణాల వల్ల డైసీ ఎడ్గార్ జోన్స్‌ ఈ సినిమా నుంచి తప్పుకున్నారు.ఆ తర్వాత ఒలీవియా మోరిస్ ఎన్టీఆర్ కు జోడీగా నటించడానికి ఎంపిక కావడం జరిగింది.చరణ్ అలియా జోడీ, ఎన్టీఆర్ ఒలీవియా మోరిస్ జోడీ బాగుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

బాక్సాఫీస్ వద్ద ఆర్ఆర్ఆర్ అంచనాలను మించి విజయం సాధించింది.

అక్కడ నాని మూవీ కేవలం 5 థియేటర్లలో రిలీజవుతోందా.. అసలేం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు