ఇదుగో 'ఆర్‌ఆర్ఆర్‌' చరణ్‌ బర్త్‌ డే స్పెషల్‌ పోస్టర్.. ఆహా అనకుండా ఉండలేం

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ఆర్ఆర్‌ సినిమా నుండి మరో పోస్టర్‌ వచ్చేసింది.

రేపు రామ్‌ చరణ్‌ పుట్టిన రోజు సందర్బంగా విడుదల అయిన ఈ పోస్టర్‌ అబ్బ అనేట్లుగా ఉంది.

అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ కనిపించబోతున్నాడు.అల్లూరి అనగానే మనకు విల్లు గుర్తుకు వస్తుంది.

ఆయన విలు విధ్యలో అద్బుతమైన ప్రావిణ్యం ఉన్నవాడు అంటారు.అందుకే ఆయన వెంట ఎప్పుడు కూడా విల్లు ఉంటుంది.

అలాంటి విలు విద్య తెలిసిన వ్యక్తి అల్లూరి పాత్రలో నటించడం అంటే మామూలు విషయం కాదు.ఆ బాడీ లాంగ్వేజ్ విల్లు పట్టుకునే తీరు అన్ని కూడా ఆహా అన్నట్లుగా ఉండాలి.

Advertisement

రాజమౌళి దేన్ని అయినా సుసాధ్యం చేస్తాడు అనడంలో సందేహం లేదు.అందుకే రాజమౌళి ని నమ్మి హీరోలు ఏళ్లకు ఏళ్లు డేట్లు ఇస్తున్నారు.

ఈపోస్టర్‌ చూస్తుంటే రామ్‌ చరణ్‌ తన కెరీర్‌ లో మళ్లీ ఇంతటి అద్బుత పాత్రను చేస్తాడా అంటే అనుమానమే అనిపిస్తుంది.విల్లు ఎక్కుపెట్టి గురి చూస్తున్న తీరును చూస్తుంటే నిజంగా అల్లూరి ఇలాగే ఉండేవాడా అన్నట్లుగా ఉంది.

రామ్ చరణ్‌ అద్బుతంగా అల్లూరిని దించేశాడు అనిపిస్తుంది.అల్లూరి గురించి వినడమే తప్ప ఎక్కువగా చూసింది లేదు.

ఆయనకు సంబంధించిన ఫొటోలు కూడా ఏమీ లేవు.గతంలో వచ్చిన సినిమాల ఆధారంగానే అల్లూరి పాత్రను రూపొందించారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

కాని ఇక్కడ అల్లూరి స్వాతంత్ర్య పోరాటం చేయడని అంటున్నారు.పోలీసు ఆఫీసర్ గా కూడా అల్లూరి పాత్రలో చరణ్ కనిపిస్తాడు అంటున్నారు.

Advertisement

ఇది చూస్తుంటే గతంలో చూసిన అల్లూరి సినిమాలు గుర్తుకు వస్తున్నాయి.కాని అసలు విషయం ఏంటీ అంటే ఇది దేశ భక్తి సినిమా కాదని మేకర్స్ పదే పదే చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో ఈ పోస్టర్ సినిమాపై మరింతగా ఆసక్తిని పెంచుతుంది అనడంలో సందేహం లేదు.

తాజా వార్తలు