దుబాయ్‌, న్యూయార్క్‌, ముంబయి... జక్కన్న టీమ్ సుడిగాలి పర్యటనలు ఖరారు

టాలీవుడ్‌ జక్కన్న సినిమాలు భారీగా ఉంటాయి.ఆయన ప్రతి సినిమా షూటింగ్ కు ముందు చాలా వర్కౌట్‌ చేస్తాడు.

 Rrr Movie Promotions In World Details, Alia Bhatt, Ntr, Ram Charan, Rrr, Rrr Rel-TeluguStop.com

నెలల తరబడి స్క్రిప్ట్‌ ను రెడీ చేసుకుంటాడు.ఆ తర్వాత షూటింగ్ ను మరో లెవల్‌ లో ప్లాన్‌ చేసి చిత్రీకరిస్తాడు.

ఇక సినిమా పూర్తి అయ్యింది అని చేతులు దులుపుకోకుండా సినిమాను ఎంత కష్టపడి అయితే తెరకెక్కించాడో అంతకు మించి అన్నట్లుగా సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటాడు.బాలీవుడ్‌ నుండి హాలీవుడ్‌ వరకు జక్కన్న పేరును మారు మ్రోగించబోతున్న ఆర్‌ ఆర్‌ ఆర్ సినిమా విడుదల త్వరలో ఉన్న నేపథ్యంలో ప్రమోషన్స్ వేడుకలు ప్రారంభం కాబోతున్నాయి.

సినిమా ప్రమోషన్స్‌ కోసం చిత్ర యూనిట్‌ సభ్యులు.దుబాయి.

న్యూయార్స్ మరియు ముంబయిల్లో భారీ ఎత్తున ప్రెస్ మీట్‌ ను ఏర్పాటు చేయబోతున్నారు.అక్కడ సినిమా ఇప్పటికే భారీ బిజినెస్ చేసింది.

వసూళ్లు కూడా అంతకు మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.

విదేశాల్లో పెద్ద ఎత్తున సినిమాను ప్రమోట్ చేయడం వల్ల కలెక్షన్స్ భారీగా ఉంటాయి.

ముఖ్యంగా యూఎస్ లో ఈ సినిమాను బిగ్గెస్ట్‌ మూవీగా హాలీవుడ్‌ సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా విడుదల చేయబోతున్నారు.ఆ రేంజ్ రిలీజ్ చేస్తే కచ్చితంగా సినిమా కు ఓపెనింగ్‌ కలెక్షన్స్ దుమ్మ లేవడం పక్కా అంటున్నారు.

Telugu Alia Bhatt, Dubai, York, Pan India, Rajamouli, Ram Charan, Rrr, Salman Kh

రికార్డు స్థాయి వసూళ్లను టార్గెట్ పెట్టుకున్న ఆర్ ఆర్‌ ఆర్ ప్రమోషనల్‌ ఈవెంట్స్ లో బాలీవుడ్‌ కోలీవుడ్ స్టార్స్ కూడా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.ముఖ్యంగా దుబాయి ప్రెస్‌మీట్‌ కు సల్మాన్ ఖాన్‌ ముఖ్య అతిథిగా రాబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.సినిమా ను సంక్రాంతి కానుకగా జనవరి 7న భారీ ఎత్తున విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే. ఆలియా భట్ ఈ సినిమా లో హీరోయిన్ గా నటించగా అల్లూరి పాత్రలో చరణ్.

కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ లు కనిపించబోతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube