యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆస్కార్ బరిలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఆయన నటన కు గాను ఆస్కార్ అవార్డు వచ్చే అవకాశం ఉంది అంటూ మీడియా వర్గాల్లో చర్చ జరుగుతుంది.
హాలీవుడ్ దర్శకులు, ప్రముఖ సినీ విశ్లేషకులు, ఇంకా ఎంతో మంది హాలీవుడ్ ప్రముఖులు ఎన్టీఆర్ నటన కు ప్రశంసలు కురిపించారు.అందుకే ఆస్కార్ అవార్డు ఆయన కు వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఆస్కార్ అవార్డు రాకున్నా కూడా ఆస్కార్ కి నామినేషన్ అయ్యే అవకాశం కచ్చితంగా కొమరం భీం పాత్ర లో నటించిన ఎన్టీఆర్ కి ఉంది అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.హాలీవుడ్ ఫేమస్ దర్శకులు కూడా సినిమా ను చూసి ఎన్టీఆర్ నటన ను అభినందిస్తున్నారు.
కనుక అద్భుతమైన ఎన్టీఆర్ నటన కు ఆస్కార్ అవార్డు వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ అభిమానులు చాలా నమ్మకం తో ఉన్నారు.

ప్రస్తుతం సినిమా యొక్క ఆస్కార్ ఎంట్రీ కి సంబంధించిన ఫార్మాలిటీస్ నడుస్తున్నాయని సమాచారం అందుతుంది.తెలుగు సినిమా పరిశ్రమ కు చెందిన ఏ ఒక్క నటుడు కి ఇప్పటి వరకు ఆస్కార్ దక్కింది లేదు, మొదటి సారి ఆస్కార్ బరి లో మన ఎన్టీఆర్ నిలవబోతున్న నేపథ్యం లో కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా దేశం వ్యాప్తం గా సినీ ప్రేమికుల గర్వించ దగ్గ విషయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఒక వేళ నిజంగానే ఎన్టీఆర్ కి ఆస్కార్ అవార్డు వస్తే అది ప్రపంచం లో అద్భుతము అంటూ అభిమానులు అభిప్రాయం చేస్తున్నారు.
ఒక ప్రాంతీయ సినిమా నటుడి కి ఆస్కార్ అవార్డు రావడం అనేది ఇప్పటి వరకు జరగలేదు.ఎన్టీఆర్ కి అది ఎంత వరకు సాధ్యం అనేది చూడాలి.
మరికొన్ని నెలల్లో ఆ విషయమై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.ఎన్టీఆర్ కి ఆస్కార్ అవార్డు వస్తే తెలుగు సినిమా గర్వించ దగ్గ విషయం అవుతుందే అనడంలో సందేహం లేదు.